కొన్ని రోజుల కిందటే సూపర్ స్టార్ మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ ఆదివారమే ప్రసారం కాబోతోంది. అబ్బాయ్ తారక్‌తో కలిసి సందడి చేసిన కొన్ని రోజులకే బాబాయి బాలయ్య ఆధ్వర్యంలో నడిచే అన్‌స్టాపబుల్ షోలోనూ మహేష్ కనిపించనున్నాడని కొన్ని రోజుల కిందటే వార్తలొచ్చాయి.
ఈ ఎపిసోడ్ షూట్ శనివారమే జరగబోతున్నట్లు కూడా చెప్పుకున్నారు. కానీ నిజంగా మహేష్.. బాలయ్య షోలో పాల్గొంటున్నాడా అని కొందరికి అనుమానంగానే ఉంది. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. మహేష్ నిజంగానే బాలయ్య షోలో సందడి చేశాడు. దీనికి ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చేశాయి. బాలయ్యతో కలిసి మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ తాలూకు ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయిపోయాయి.
బ్లూ కలర్ హుడీ, జీన్స్, బ్లాక్ అండ్ వైట్ స్నీకర్స్ వేసుకుని సోఫాలో చాలా కూల్‌గా మహేష్ కూర్చున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎదురుగా బాలయ్య ఉన్న ఫొటోలు కూడా హల్‌చల్ చేస్తుండటంతో ఇది అన్ స్టాపబుల్ షో తాలూకు ఫొటోలే అని అర్థమైపోతోంది. మామూలుగా మహేష్ చాలా రిజర్వ్డ్‌గా కనిపిస్తాడు కానీ.. అతడి సెన్సాఫ్ హ్యూమర్ మామూలుగా ఉండదని సన్నిహితులు చెబుతుంటారు.
చాలా ఎంటర్టైనింగ్‌గా సాగుతున్న బాలయ్య షోలో మహేష్ తనదైన శైలిలో పంచ్‌లు కురిపిస్తే ఈ ఎపిసోడ్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వస్తుందనడంలో సందేహం లేదు. కాగా బాలయ్య కొత్త చిత్రం అఖండ సక్సెస్ మీట్‌కు సైతం మహేష్ హాజరు కాబోతున్నాడని.. ఈ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం పాల్గొంటాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం విశేషం.
This post was last modified on December 4, 2021 10:37 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…