నాగార్జున, నాగచైతన్య కాంబినేషనే ‘బంగార్రాజు’ సినిమాకి అత్యంత హైప్ ఇచ్చే విషయం. ఇక ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న అప్‌డేట్స్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రానుందని టాక్. అందుకే ప్రమోషన్స్‌లో కూడా స్పీడ్ పెరిగినట్టు కనిపిస్తోంది.
ఆల్రెడీ నాగార్జున దేవకన్యలతో ఆడి పాడుతున్న లడ్డుందా సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. త్వరలో నాగచైతన్య సాంగ్ కూడా రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ఇప్పుడు వదిలారు. ‘నాకోసం మారావా నువ్వూ.. లేక నన్నే మార్చేశావా నువ్వూ’ అంటూ సాగే ఈ పాట క్యాచీగా ఉంది. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు. సిద్ శ్రీరామ్ తన స్టైల్‌లో పాడాడు.
చైతు, కృతీశెట్టిలపై చిత్రీకరించిన పాట ఇది. చిన బంగార్రాజుగా చైతు, నాగలక్ష్మిగా కృతిల లుక్స్ ఎలా ఉంటాయో ఇప్పటికే పరిచయం చేశారు. ఇప్పుడు వాళ్లిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం బాగుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌లో ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. పూర్తి పాట డిసెంబర్ 5న విడుదల కానుంది.
This post was last modified on December 2, 2021 4:28 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…