‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్.. చెప్పిన టైమ్ కి రాదట!

‘బాహుబలి’ లాంటి భారీ సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి కొన్ని పాటలను, హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేశారు.

ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ ను ముంబైలో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా వస్తారని కూడా అన్నారు. కానీ ఇప్పుడు చెప్పిన టైమ్ కి ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రావడం లేదట.

కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తుంది చిత్రబృందం. డిసెంబర్ 10 లేదా 11 తేదీల్లో ట్రైలర్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. కొత్త డేట్ ను ప్రకటిస్తూ.. ఒకట్రెండు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. మరి దీనికి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!