నేచురల్ స్టార్ నాని కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. అతడి గత రెండు చిత్రాలు వి, టక్ జగదీష్ ఓటీటీ బాట పట్టడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. పైగా అవి నాని స్థాయికి ఏమాత్రం తగని చిత్రాలు. ఓటీటీకి వెళ్లడం వల్ల పాసైపోయాయి కానీ.. అవి ప్రేక్షకులకైతే రుచించలేదు. ఈ సారి నాని నుంచి మంచి క్వాలిటీ ఉన్న సినిమా ఆశిస్తున్నారు. పైగా అది థియేటర్లలో విడుదలై మంచి ఫలితాన్ని అందుకోవాల్సిన అవసరమూ ఉంది. ‘శ్యామ్ సింగరాయ్’ అలాంటి సినిమానే అని నాని ధీమాగా ఉన్నాడు.
మంచి టైమింగ్ చూసి ఈ సినిమా రిలీజ్ చేయాలని నాని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు. అన్నీ చూసుకుని సోలోగా క్రిస్మస్ బరిలో తమ చిత్రాన్ని నిలిపాడు. కానీ అనుకోకుండా దానికి పోటీగా ‘గని’ వచ్చి పడింది. కానీ తర్వాత ఆ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంకా క్లారిటీ అయితే రాలేదు.ఐతే ‘గని’తో పోటీ గురించి కంగారు పడుతుంటే.. నానికి ఇప్పుడు కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ మూవీ ‘83’తో ఇప్పుడు తంటా వచ్చి పడింది. ఈ సినిమా కూడా క్రిస్మస్ కానుకగానే విడుదల కాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు.
ఇది 1983లో భారత జట్టు అండర్ డాగ్‌గా బరిలోకి దిగి సంచలన రీతిలో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న నేపథ్యంలో నడిచే సినిమా. ఏమో అనుకున్నారు కానీ.. ఈ రోజు లాంచ్ చేసిన ట్రైలర్ చూశాక భాషా భేదం లేకుండా అందరిలోనూ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. క్రికెట్ అంటే భారతీయులకు ఉన్న ఎమోషన్ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. వాళ్ల ఎమోషన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లే సినిమాలా కనిపిస్తోందిది. ఈ చిత్రాన్ని ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ విడుదల కాబోతోంది. తెలుగు ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించే సినిమాలాగే కనిపిస్తోంది. సైలెంటుగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రభావమే చూపేలా ఉందీ చిత్రం. అలాగే తెలుగు రాష్ట్రాల అవతల, ఓవర్సీస్‌లో ‘83’ ప్రభావం గట్టిగానే ఉండేలా ఉంది. మరి ఈ సినిమా నాని మూవీకి ఏమేర డ్యామేజ్ చేస్తుందో చూడాలి.
This post was last modified on November 30, 2021 5:22 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…