టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సినీ శిల్పి జక్కన్న చెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కిన ఈ భారీ మల్టీస్టారర్ పై ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఆ ఆశలకు, అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జనవరి 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్ర ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతందా అన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరదించుతూ తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తన అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ లో షేర్ చేసింది. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక, ఈ పీరియాడిక్ డ్రామా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో వరల్డ్ వైడ్ థియాట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
This post was last modified on November 29, 2021 6:36 pm
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…