మ‌హిళ‌ల సొమ్ముకు జ‌గ‌న్ ఎస‌రు.. 2000 కోట్లు.. ప్ర‌భుత్వ ప‌రం!

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం తీవ్ర‌మైన ఆర్ధిక సంక్షోభంలో  కొట్టుమిట్టాడుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ నిధులు స‌రిపోక నానా ప్ర‌యాస ప‌డుతోంది. వ‌చ్చిన సొమ్ము వ‌చ్చిన‌ట్టు.. ఖ‌ర్చయిపోతుండ‌డంతో.. ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంది. ప‌థ‌కాలు.. సంక్షేమం.. అంటూ.. కోట్ల‌కు కోట్లు.. ఖర్చుపెడుతున్నామ‌ని.. ప్ర‌భుత్వం చెబుతున్నా.. దీనికి మించి ప్ర‌క‌ట‌నల ఖ‌ర్చు, స‌ల‌హాదారుల వేత‌నాల ఖ‌ర్చు వంటివి.. ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ అప్పులు చేస్తూ.. రాష్ట్రంలో ఆర్థిక అస్త‌వ్య‌స్త‌త‌కు దారితీస్తున్నార‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ భూముల‌ను అమ్ముకునేందుకు రంగం రెడీ చేశారు. అదేస‌మ‌యంలో కార్పొరేష‌న్ల ద్వారా.. 180 శాతం ప్ర‌భుత్వ గ్యారెంటీతో అప్పులు తెచ్చుకునేందుకు ఏకంగా స‌భ‌లోనే బిల్లు ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకున్నారు. ఇవ‌న్నీ జ‌రుగుతున్న క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అనేక సంస్కర‌ణ‌ల‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలే కొన్ని వ్య‌తిరేకిస్తున్నా.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం నెత్తిన పెట్టుకుంటోంది. దీనిలో భాగ‌మే.. రైతుల ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీట‌ర్లు పెట్ట‌డం.. చెత్త‌పై ప‌న్ను, మ‌రుగుదొడ్ల షింకుల ఆధారంగా ప‌న్నులు వేస్తోంది.

ఇవ‌న్నీ కూడా రుణాల మంజూరు కోస‌మే. కేంద్రాన్ని ఎంత మెప్పిస్తే.. అంత ఎక్కువ‌గా రుణాలు తెచ్చుకునే అవ‌కాశం వ‌స్తుంది. దీనిని ఏపీ స‌ర్కారు వినియోగించుకునే ప్ర‌య‌త్నాలు .. ఇప్పుడు ఈ రుణాలు కూడా స‌రిపోవ‌డం లేదు. దీంతో గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన అభ‌య‌హ‌స్తం నిధుల‌ను కూడా వాడేసేందుకు రెడీ అయింది. అభ‌య హ‌స్తం.. ప‌థ‌కాన్ని వైఎస్ 2006లో తీసుకువ‌చ్చారు. దీనికింద డ్వాక్రా మ‌హిళ‌లు రోజుకు రూపాయి చొప్పున దాచుకుంటే.. దీనికి ప్ర‌భుత్వం మ‌రో రూపాయి జ‌మ చేస్తుంది. ఈ నిధుల‌ను ఎల్ ఐసీలో ఉంచారు. దీనికి పెద్ద ఒప్పంద‌మే ఉంది.

ఇక‌, ఇలా 2006 నుంచి ఇప్ప‌టి వ‌రకు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మ‌హిళ‌లు దాచుకున్న సొమ్ము ఏకంగా 2000 ఉంది. ఇప్పుడు ఈ సొమ్ముపై క‌న్నేసిన ఏపీ స‌ర్కారు.. ఈ నిధుల‌ను సొంతం చేసుకునేందుకు ఎల్ ఐసీతో ఉన్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసింది. దీనిని ఎల్ ఐసీ తాజాగా ధ్రువీక‌రించింది. త‌మ‌కు అభ‌య‌హ‌స్తం ప‌థ‌కానికి సంబంధం లేద‌ని.. ఇక నుంచి మ‌హిళ‌ల‌కు ఎలాంటి పింఛ‌న్లు తాము ఇవ్వ‌బోమ‌ని.. స్ప‌ష్టం చేసింది. దీంతో ఇక‌, ఈ సొమ్ము.. ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.