కత్రినా, కరీనాల సమంత ఫేమస్ అవుతుందా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇప్పుడు మిగిలిన భాషల్లో కూడా పాగా వేయాలని చూస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కి చెందిన టాప్ ప్రొడక్షన్ హౌస్ తో డీల్ ఫిక్స్ చేసుకోవాలని చూస్తుంది. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ అనేది బిగ్ ప్రొడక్షన్ హౌస్. హీరోయిన్లతో కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవడంలో ఈ సంస్థ ఆచితూచి వ్యవహరిస్తుంటుంది.

గతంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, కరీనా కపూర్ లాంటి ఎంతోమంది హీరోయిన్లు యష్ రాజ్ సినిమాలతో పాపులర్ అయ్యారు. రెమ్యునరేషన్ తక్కువగా ఇచ్చినా.. ఆ బ్యానర్ లో సినిమాలు చేయడం వారి కెరీర్ కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు సమంత కూడా ఈ సంస్థ తో బాలీవుడ్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తోంది. ఒకేసారి రెండు, మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉంది సామ్.

అయితే యష్ రాజ్ ఫిలిమ్స్ తో డీల్ అంటే మాములుగా ఉండదు. మూడ్నాలుగేళ్ల పాటు లాక్ అయిపోయినట్లే. ఈ గ్యాప్ లో బయట బ్యానర్లలో నటించే అవకాశం వచ్చినా.. వదులుకోవాల్సిందే. ప్రస్తుతం సమంత తమిళంలో ఓ సినిమా, తెలుగులో ఓ సినిమా కమిట్ అయింది. వీటితో పాటు ఓ ఇంటర్నేషనల్ సినిమా కూడా ఒప్పుకుంది. మరి బాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి!