తెలుగు బిగ్ బాస్ షో అరంగేట్ర సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ నడిపించాడు. తర్వాతి సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ అయ్యాడు. కానీ అతను కూడా ఒక సీజన్‌తో షోకు టాటా చెప్పేశాడు. ఇక అప్పట్నుంచి అక్కినేని నాగార్జునే ఈ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు సీజన్లోనూ ఆయనే షోను నడిపిస్తున్నాడు. ఐతే గత ఏడాది నాగార్జున తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజులు షోకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం లద్దాక్ వెళ్లాల్సి రావడంతో నాగ్ షోను విడిచిపెట్టక తప్పలేదు. ఆ టైంలో సీనియర్ నటి రమ్యకృష్ణ షోను హోస్ట్ చేసింది. ఏమో అనుకున్నారు కానీ…రమ్యకృష్ణ తనదైన శైలిలో షోను నడిపించి ప్రశంసలు అందుకుంది. కొందరైతే ఆమెను ఫుల్ టైం హోస్ట్‌ను చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. అప్పుడు నాగ్ గైర్హాజరీలో తెలుగు ‘బిగ్ బాస్’కు తోడ్పాటు అందించిన రమ్య.. ఇప్సుడు తమిళంలోనూ ఈ షోను కొన్ని రోజుల పాటు హోస్ట్ చేయబోతుండటం విశేషం.
తమిళ బిగ్ బాస్‌ను ఆరంభం నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ నడిపిస్తుండటం తెలిసిందే. ఈ సీజన్‌కు హోస్ట్ మారతారని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. కమలే మళ్లీ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐతే షో మధ్యలో ఉండగా కమల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో అత్యవసరంగా తాత్కాలిక హోస్ట్‌ను తీసుకురావాల్సి వచ్చింది. తెలుగులో కొన్ని ఎపిసోడ్లను చక్కగా నడిపించిన రమ్యనే తమిళ షోకు కూడా తీసుకోవాలని నిర్ణయించారు.
రమ్యకృష్ణ బేసిగ్గా తమిళ అమ్మాయే. తమిళం బాగా మాట్లాడుతుంది. అక్కడ ఆమెకు మంచి పాపులారిటీ కూడా ఉంది. తమిళ బిగ్ బాస్‌ను కొన్ని రోజులు హోస్ట్ చేయడానికి ఆమెకు కూడా అభ్యంతరం లేకపోయింది. మంచి పారితోషకం కూడా ఇస్తుండటంతో సంతోషంగా ఈ పని ఒప్పుకుంది. కమల్ కోలుకుని తిరిగొచ్చే వరకు ఆమెనే తమిళ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించనుంది.
This post was last modified on November 28, 2021 5:50 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…