అదితి రావు హైదరి.. హిందీ, తమిళం, తెలుగు ఇలా పలు భాషల్లో చాలా మంచి పేరు సంపాదించిన నటి. అందం, అభినయం రెంటితోనూ ఆమె ఆకట్టుకుంది. అదితి తెలుగమ్మాయే అనే సంగతి చాలామందికి తెలియదు. ఆమె పుట్టింది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో. బాల్యం అక్కడే సాగింది. ఆ తర్వాత హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో పెరిగి పెద్దదైంది అదితి. ఆమె పేరు వెనుక రావుతో పాటు హైదరి అని ఉండటం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.
ఉంటే రావు అని ఉండాలి లేదంటే హైదరి అని ఉండాలి. ఇలా రెండు ఇంటి పేర్లు ఏమిటని అనిపిస్తుంది. ఇందుకు కారణమేంటో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అదితి. రావు అనేది తన తల్లి శాంతా రామేశ్వరరావు పేరు నుంచి తీసుకుందని.. హైదరి తన తండ్రి ఇషాన్ హైదరి ఇంటి పేరని ఆమె వెల్లడించింది. తన తల్లి, తండ్రి ఇద్దరూ రాజ వంశానికి చెందిన వారేనని.. తాను చిన్నమ్మాయిగా ఉన్నపుడే వాళ్లిద్దరూ విడిపోయారని ఆమె వెల్లడించింది.
తండ్రి నుంచి విడిపోయాక తల్లి తనను తీసుకుని ఢిల్లీకి వెళ్లిపోయిందని.. అక్కడే తమ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటూ తనను చదివించిందని అదితి తెలిపింది. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నా.. తనను చూసేందుకు తరచుగా వస్తుంటాడని.. ఆయనకు తనపై అపారమైన ప్రేమ అని.. అందుకే తండ్రి ఇంటి పేరును వదులుకోలేదని.. తనను పెంచి పెద్ద చేస్తోంది అమ్మే కాబట్టి ఆమె ఇంటి పేరునూ పెట్టుకున్నానని ఆమె చెప్పింది.
తన స్కూలింగ్ అంతా మదనపల్లిలోని రిషీ వ్యాలీ స్కూల్లో సాగిందని.. ఆ తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుకున్నానని.. చిన్నప్పట్నుంచి భరతనాట్యంలో ప్రవేశం ఉందని.. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చానని.. ఒకసారి తన పెర్ఫామెన్స్ చూసిన తమిళ దర్శకురాలు శారదా రామనాథన్ స్క్రీన్ టెస్ట్ కూడా చేయకుండా ‘శృంగారం’ అనే సినిమాలో అవకాశమిచ్చిందని.. అందులో గుడిలో నృత్యం చేసే దేవదాసిగా నటించానని.. ఆ సినిమా చాలా కాలం విడుదలకు నోచుకోక, అవకాశాలూ రాక తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానని అదితి తెలిపింది. ఆపై ఓ మలయాళ సినిమాలో అవకాశం వచ్చిందని.. నెమ్మదిగా హిందీ, తమిళం, తెలుగులోనూ అవకాశాలు అందుకుని కథానాయికగా స్థిరపడ్డానని ఆమె చెప్పింది.
This post was last modified on June 9, 2020 4:48 pm
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో…
అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్…