‘అఖండ’ స్టేజ్ పై బన్నీ క్లారిటీ ఇస్తాడా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి అల్లు అర్జున్, రాజమౌళి అతిథులుగా హాజరుకానున్నారు. అయితే ఈ ఈవెంట్ లో బన్నీ తన నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇవ్వబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న బన్నీ తన తదుపరి సినిమా ఎవరితో చేయనున్నారనే విషయాన్ని కన్ఫర్మ్ గా చెప్పడం లేదు. ముందుగా వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘ఐకాన్’ చేస్తారని అన్నారు. కానీ కొంతకాలం పాటు ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారని.. బన్నీ మరో డైరెక్టర్ కోసం చూస్తున్నాడని అన్నారు. ఈ క్రమంలో బోయపాటి పేరు బాగా వినిపించింది. నిజానికి బోయపాటి-అల్లు అర్జున్ కలిసి చాలా రోజులుగా ఓ సినిమా చేయాలనుకుంటున్నారు.

ఫైనల్ గా బన్నీ ఇప్పుడు ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఆ విషయాన్ని ‘అఖండ’ స్టేజ్ పై చెప్పబోతున్నారని టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నిజంగానే ఈ కాంబో సెట్ అయితే గనుక.. మరో ఊరమాస్ సినిమా రావడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి!