త్రివిక్రమ్ రెమ్యునరేషన్.. రూ.15కోట్లు+షేర్స్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అంత పెద్ద హిట్ అందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలుపెట్టలేదు. మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సినిమా కోసం పని చేస్తున్నారు త్రివిక్రమ్. ‘భీమ్లా నాయక్’ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారాయన.

ఈ సినిమాకి పని చేస్తున్నందుకు గానూ.. ఆయన రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు.. దీంతో పాటు సినిమా ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుంటారట. ఒక సినిమాకి ఈ రేంజ్ లో పారితోషికం అందుకోవడమంటే మాములు విషయం కాదు. కేవలం మాటలు, స్క్రీన్ ప్లే అనే కాకుండా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే నిర్మాతలు ఇంత మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు.

పైగా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తరువాత సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. సినిమాలో రానా మరో హీరోగా కనిపించనున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.