ఆత్రంగి రే.. హిందీలో క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం. ఇంతకుముందు ధనుష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేస్తూ రాన్‌జానా సినిమా తీసిన ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన సినిమా ఇది. ధనుష్‌తో పాటు సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మొదలై చాలా తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి హాట్ స్టార్‌లో ఆత్రంగి రే స్ట్రీమ్ కానుంది.
ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. అది చూస్తే ఆనంద్ తీసి తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాన్‌జానా సినిమాల్లాగే ఇది కూడా కొంచెం ఎమోషనల్ టచ్ ఉన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌లాగే కనిపిస్తోంది. రాన్‌జానాతో హిందీ ప్రేక్షకులను కట్టి పడేసిన ధనుష్.. మరోసారి వారి మనసులు కొల్లగొట్టేలాగే కనిపిస్తున్నాడు.
ఆత్రంగి రే.. కథ విషయానికి వస్తే ఒక తమిళ అబ్బాయికి, హిందీ అమ్మాయికి అనుకోకుండా పెళ్లి చేసి పడేస్తారు పెద్దలు. కానీ వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు ఇష్టం ఉండదు. ఇద్దరం విడిపోదాం అనుకుంటారు. కానీ అందుకు కొంత సమయం పడుతుంది. ఈ లోపు అమ్మాయి మీద అబ్బాయికి ప్రేమ పడుతుంది.
అబ్బాయి మీద కూడా అమ్మాయికి పాజిటివ్ ఫీలింగే కలుగుతుంది. కానీ ఈలోపు అమ్మాయికి నచ్చిన వాడు ఆడంబరంగా వస్తాడు. అమ్మాయి అతడితో వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. కానీ ఆమెను ఇష్టపడ్డ అబ్బాయి గిలగిలలాడిపోతాడు. తను వెడ్స్ మను, దాని సీక్వెల్ తరహాలోనే ఇందులోనూ హీరోయిన్ పాత్ర అత్యంత కీలకంగా కనిపిస్తోంది.
సారా ఆ పాత్రలో అదరగొట్టినట్లే ఉంది. ధనుష్ గురించి చెప్పేదేముంది? ట్రైలర్లోనే వావ్ అనిపించాడు. అతిథి పాత్ర లాంటి క్యారెక్టర్లో అక్షయ్ కుమార్ కూడా బాగానే చేసినట్లున్నాడు. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on November 24, 2021 9:44 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…