రామ్ గోపాల్ వర్మను ఆయన వీరాభిమానులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఆయన సినిమాల్లో క్వాలిటీ ఆ స్థాయిలో పడిపోయింది. ఇదే మాట వర్మ దగ్గర అంటే.. నా మీద అంచనాలు పెట్టుకోవడానికి మీరెవరు.. నేను ఇలాంటి సినిమాలే తీస్తా అని వాళ్లకేమైనా చెప్పానా.. ఎలా సినిమా తీయాలో నా ఇష్టం ఏదో లాజిక్ తీసి అందరి నోళ్లు మూయించేస్తాడు. పదేళ్ల కిందట్నుంచి సాగుతోంది ఈ వాదం.
ఆయన దృష్టంతా ఏ టాపిక్ తీసుకుంటే వివాదం రాజేయొచ్చు.. జనాల దృష్టి దాని మీద పడేలా చేయొచ్చు అన్నదాని మీదే ఉంటుంది. తన క్రియేటివిటీనంతా కూడా ఆయన పబ్లిసిటీ కోసమే వాడుతున్నారు తప్ప.. సినిమా మేకింగ్ కోసం కాదు అనే స్టేట్మెంట్ నూటికి నూరు శాతం నిజం. కాబట్టే వర్మ ఎంత చెత్త సినిమా తీసినా.. ఆ తర్వాత సినిమాకు మళ్లీ జనాల్ని ఆకర్షించగలుగుతున్నాడు. ఆయన తాజా సినిమా ‘క్లైమాక్స్’ విషయంలోనూ అదే జరిగింది.
నిన్న రాత్రి వర్మ సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’లో ‘క్లైమాక్స్’ రిలీజైంది. పే పర్ వ్యూ పద్ధతిలో రూ.100 రేటుతో ఈ సినిమాను చూసే అవకాశం కల్పించాడు వర్మ. దీనికి ఏమాత్రం రెస్పాన్స్ ఉంటుందిలే అనుకుంటే.. కుర్రకారు బాగానే ఆసక్తి చూపించారు. కొన్ని గంటల్లోనే 3 లక్షల మంది ఈ సినిమాను వీక్షించారు. అంటే ఒక్కొక్కరు రూ.100 చొప్పున చెల్లించి ఉంటే అప్పటికే నిర్మాతల ఖాతాలో రూ.3 కోట్లు చేరిందన్నమాటే. ఈ సినిమా స్థాయికి అది పెద్ద మొత్తమే. ఫుల్ రన్లో ఎంత ఆదాయం వస్తుందో చూడాలి. ఈ వ్యూస్‌కు సంబంధించి వర్మ ఉబ్బితబ్బిబ్బయిపోతూ ట్వీట్లు వేశాడు. తనను పొగిడిన ట్వీట్ల మీద కూడా స్పందించాడు.
కానీ ‘క్లైమాక్స్’ సినిమా ఎంత చెత్తగా ఉందో చెబుతూ.. అది చూసిన వాళ్లు ఫ్రస్టేషన్‌తో పెట్టిన ట్వీట్లను మాత్రం వర్మ విస్మరించాడు. ఈ సినిమాను ఫ్రీగా చూపించినా ఎవరూ చూడొద్దంటూ వీక్షకులు కామెంట్ చేస్తున్నారు. వర్మ మీద ఎంత తక్కువ అంచనాలు పెట్టుకున్నా కూడా నిరాశ తప్పదని.. గంట లోపు నిమిషాల నిడివే అయినా భరించడం చాలా చాలా కష్టమని అంటున్నారు.
This post was last modified on June 7, 2020 2:18 pm
విశాఖపట్నం ఐటీ మ్యాప్‌పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి…
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…
మూడు నెలల కాలంలో అద్భుత విజయాలను సాధించాలని టిడిపి అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి…
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…