తెలుగులో హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రగ్యాజైస్వాల్ కి సరైన సక్సెస్ రాలేదు. ‘కంచె’ తరువాత ఆమె లిస్ట్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయినప్పటికీ ఆమెకి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. ఆయుష్ శర్మ హీరోగా తెరకెక్కిన ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. ఆయుష్ తన చెల్లెలి భర్త కావడంతో సల్మాన్ ఈ సినిమాని నిర్మించడంతో పాటు ఓ పాత్రలో కూడా నటించారు. ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా ప్రగ్యాజైస్వాల్ ను తీసుకున్నారు.
దీంతో ప్రగ్యా తెగ సంబరపడిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకి సల్మాన్ ఖాన్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ముందుగా సల్మాన్-ప్రగ్యాజైశ్వాల్ ల మీద కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించారు. అలానే ఓ పాటను కూడా చిత్రీకరించారు. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ లవ్ ట్రాక్ మొత్తాన్ని తీసేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేష్ మంజ్రేకర్, సల్మాన్ ఖాన్.. ఈ రొమాంటిక్ ట్రాక్ లేకపోతే బెటర్ గా ఉంటుందని భావించడంతో ప్రగ్యా జైస్వాల్ సన్నివేశాలన్నీ డిలీట్ చేసేశారట.
ఇప్పుడు సినిమాలో ఆమెకి సంబంధించిన ఒక్క సీన్ కూడా ఉండదని తెలుస్తోంది. ‘అంతిమ్’తో తనకు అవకాశాలు పెరుగుతాయని భావించిన ప్రగ్యాకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కనీసం ఈ సినిమాతోనైనా.. ప్రగ్యాకు బ్రేక్ వస్తుందేమో చూడాలి!
This post was last modified on November 24, 2021 3:29 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…