ఆ హీరో కొడుకు రీలాంచ్

Srikanth Son

మిడిల్ ఏజ్డ్ హీరో శ్రీకాంత్ తన కొడుకు రోషన్ ను మరోసారి లాంచ్ చేయబోతున్నాడు. గతంలో ఈ వ్యవహారాన్ని హీరో నాగార్జువన తన భుజం మీద వేసుకుని, నిర్మల కాన్వెంట్ అనే సినిమా అందించారు. ఆ సినిమా ప్రమోషన్ మొత్తం నాగ్ తన భుజాల మీద వేసుకుని మోసారు. అయినా సినిమా సక్సెస్ కాలేదు.

ఇన్నాళ్ల తరువాత మళ్లీ రోషన్ పూర్తి స్థాయి హీరోగా తెరపైకి రాబోతున్నాడు. ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే, విలన్ వేషాలు వేస్తున్న టైమ్ లో శ్రీకాంత్ ను హీరోగా మార్చిన దర్శకుడు రాఘవేంద్రరావే రోషన్ ను పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేయబోతున్నారు. రాఘవేంద్రరావు అందించే కథ, స్క్రీన్ ప్లేకు ఆయన అసిస్టెంట్ గౌరి దర్శకత్వం వహిస్తారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వుంటుంది.

ఈ సినిమాను రాఘవేంద్రరావే నిర్మిస్తారు. మార్కెటింగ్ భాగస్వామ్యం దిల్ రాజు చూసుకుంటారు. ఆ విధంగా ఆర్కే బ్యానర్, దిల్ రాజు బ్యానర్ రెండూ వుంటాయి.