అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం పనులన్నీ వేగంగా పూర్తి చేస్తోంది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, మరోపక్క షూటింగ్ ఒకేసారి జరుగుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో సమంతపై ఐటెం సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఇలాంటి సమయంలో చిత్రయూనిట్ కి సడెన్ షాక్ తగిలింది.
దర్శకుడు సుకుమార్ అస్వస్థతకు గురికావడంతో.. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత రెండు నెలలుగా సుకుమార్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. విశ్రాంతి లేకుండా పని చేస్తుండడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఇప్పుడు ‘పుష్ప’ పనులకు బ్రేక్ పడింది. ఈ నెలాఖరుకి సుకుమార్ కోలుకొని తిరిగివస్తే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ అందుకుంటాయి.
లేదంటే మాత్రం మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ లో గనుక ‘పుష్ప’ రిలీజ్ అవ్వకపోతే మళ్లీ సమ్మర్ వరకు సరైన డేట్ దొరకడం కష్టం. జనవరి నుంచి మార్చి వరకు వరుసగా పెద్ద సినిమాలు స్లాట్స్ బుక్ చేసుకున్నాయి. వాటితో పోటీ పడే కంటే సినిమాను వాయిదా వేసుకోవడం మంచిది. అందుకే అక్కడవరకు వెళ్లకుండా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. మరిప్పుడు చెప్పిన టైమ్ కి సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి!
This post was last modified on November 24, 2021 3:03 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…