మెగాస్టార్ చిరంజీవి మూవీ.. పరాజయాలే ఎరుగని కొరటాల శివ డైరెక్టర్ చేస్తున్నాడు.. పైగా రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్నాడు.. ఇంతకంటే ఏం కావాలి ‘ఆచార్య’ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూడటానికి! అందుకే మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రియుల కళ్లన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. వారి ఆసక్తిని వరుస అప్‌డేట్స్‌తో మరింత పెంచే ప్లాన్స్‌లో ఉంది టీమ్.
ఆచార్య మూవీ నుంచి విడుదలైన మొదటి పాట ‘లాహే లాహే’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వంద మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని రీసెంట్‌గా ప్రకటించిన టీమ్.. త్వరలో మరో అదిరిపోయే అప్‌డేట్ రాబోతోందని చెప్పింది. దాంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ అప్‌డేట్ ఏమై ఉంటుందా అని అంచనాల మీద అంచనాలు వేసే పనిలో పడ్డారంతా.
ఫిబ్రవరి 4న ఆచార్య మూవీ థియేటర్స్‌కి రాబోతోంది. సమయం మరీ ఎక్కువేమీ లేదు కనుక ప్రమోషన్స్‌లో కూడా జోరు పెంచాల్సి ఉంది. కాబట్టి ఏదో ఒక మెస్మరైజింగ్ అప్‌డేట్ వదిలి ప్రేక్షకుల్ని పూర్తిగా తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టున్నారు మేకర్స్. అది కచ్చితంగా రామ్‌చరణ్ పోషిస్తున్న పాత్రకి సంబంధించిన టీజరే అయ్యుంటుందని ఇండస్ట్రీ టాక్.
ఇందులో సిద్ధ అనే పాత్రలో కనిపించబోతున్నాడు చెర్రీ. నిడివి తక్కువే అయినా సినిమాకి పిల్లర్‌గా నిలిచే క్యారెక్టర్. పైగా అతని పాత్రకి శాడ్ ఎండింగ్ ఇచ్చారనే టాక్ కూడా ఉంది. అంటే చాలా ఎమోషనల్‌గా కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ తెలిశాక చెర్రీ రోల్‌పై క్యూరియాసిటీ పెరిగింది ఫ్యాన్స్‌కి. టీజర్ ద్వారా దాన్ని రుచి చూపిస్తారేమోననే ఆశతో ఉన్నారు. మరి అదిరిపోయే అప్‌డేట్ అదేనా లేక మరేదైనా ప్లాన్ చేశారా చూడాలి.
This post was last modified on November 23, 2021 2:03 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…