Movie News

అలా అన్న రాజ‌మౌళి.. ఇలా చేస్తున్నాడేంటి?

కొన్ని రోజుల కింద‌టే ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి ఒక ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో పాల్గొన్నాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆ సంద‌ర్భంగా 2022 జ‌న‌వ‌రి 7న‌ ఆర్ఆర్ఆర్‌, 6న గంగూబాయి క‌తియావాడీ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌టం గురించి ఓ విలేక‌రి ప్ర‌శ్నిస్తే.. కొవిడ్ అనంత‌ర ప‌రిస్థితుల్లో ఇలాంటి పోటీ అనివార్య‌మ‌ని, త‌న దృష్టిలో పోటీ వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య లేద‌ని.. విష‌యం ఉంటే రెండు కాదు, ఎన్ని సినిమాలైనా కూడా ఒకేసారి రిలీజై బాగా ఆడ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

దీన్ని బ‌ట్టి త‌న సినిమా వ‌ల్లో మ‌రో చిత్రానికి.. ఇంకో సినిమా వ‌ల్ల త‌న చిత్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న‌ది రాజ‌మౌళి అభిప్రాయం అన్న‌ది స్పష్టం. ఐతే మీడియా ముందు అలా చెప్పిన జ‌క్క‌న్న‌.. ఆర్ఆర్ఆర్‌కు పోటీ లేకుండా చూడ‌టానికి తెర వెనుక గట్టి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా ఈ మ‌ధ్య జోరుగా వార్త‌లొస్తున్నాయి.

గంగూబాయి క‌తియావాడీ సినిమాను ఆర్ఆర్ఆర్‌కు భ‌య‌ప‌డి వాయిదా వేయ‌లేద‌ని.. రాజ‌మౌళి విన్న‌పం మేర‌కే ఈ సినిమాకు డేట్ మార్చార‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొచ్చాయి. ఇప్పుడేమో భీమ్లా నాయ‌క్ మూవీని జ‌న‌వ‌రి 12 నుంచి త‌ర‌లించేందుకు రాజ‌మౌళి గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ చేసిన ప్ర‌య‌త్నం కూడా విఫ‌ల‌మ‌వ‌డంతో ఇప్పుడు రాజ‌మౌళి నేరుగా రంగంలోకి దిగుతున్నాడ‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసి డేట్ మార్చుకునే విష‌య‌మై రిక్వెస్ట్ చేయ‌బోతున్నాడ‌ని అంటున్నారు. ఇదే నిజ‌మైతే జ‌క్క‌న్న పైకి చెప్పిన మాట‌ల‌కు, లోలోన చేస్తున్న ప‌నికి పొంత‌న లేదు అనుకోవాలి. అంటే వేరే సినిమాల‌కు జ‌క్క‌న్న భ‌య‌ప‌డుతున్నాడ‌ని కాదు కానీ.. పోటీ వ‌ల్ల థియేట‌ర్లు త‌గ్గి త‌మ చిత్రానికి రెవెన్యూ త‌గ్గుతుంద‌న్న‌ది ఆయ‌న ఆందోళ‌న కావ‌చ్చు.

This post was last modified on November 22, 2021 8:50 pm

Share
Show comments

Recent Posts

టీమిండియా విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ ఎంతంటే?

టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో 4 వికెట్ల తేడాతో…

12 minutes ago

టీడీపీ త్యాగం!.. కూటమి మరింత ధృడం!

టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఏపీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఏ మేరకు ఉందన్న విషయాన్ని టీడీపీ అదినేత,…

23 minutes ago

ఫైనల్ లో భారత్ ఘనవిజయం… ట్రోఫీ మనదే!

టీమిండియా చరిత్రను తిరగరాసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి టైటిల్‌ను కైవసం…

47 minutes ago

కష్టే ఫలి!.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

పార్టీ కోసం కష్ట పడే వారికే పదవులు దక్కుతాయి. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదు. ఈ మాటలు టీడీపీ…

2 hours ago

రాములమ్మకు ఎమ్మెల్సీ.. అగ్ర నేతల మాట నెగ్గలేదు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ…

3 hours ago

వారంతా లేన‌ట్టే..

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌(శ్రీశైలం కుడి కాల్వ‌) టన్నెల్‌లో గ‌త నెల 22న జ‌రిగిన ప్ర‌మాదంలో చిక్కుకు పోయిన‌.. ఆరుగురు…

4 hours ago