నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తో పది రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ సినిమా కోసం ప్రభాస్ 200 రోజుల డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి ముందుగా మిక్కీ జె మేయర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.
అయితే ఇప్పుడు మిక్కీ స్థానంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ను ప్రభాస్ సినిమా కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట. ‘కబాలి’, ‘కాలా’ వంటి సినిమాలకు సంతోష్ మ్యూజిక్ అందించారు.
తమిళంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల బీజియమ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. నాని నటిస్తోన్న ‘దసరా’ సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కానీ ఇంతలోనే ప్రభాస్ సినిమా ఛాన్స్ వచ్చిందని టాక్.
మిక్కీ జె మేయర్ ను తప్పించి సంతోష్ నారాయణన్ ను తీసుకున్నారా..? లేక కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఆయన్ను తీసుకుంటున్నారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. మరి దీనిపై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారు.
This post was last modified on November 22, 2021 9:42 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…