ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది కృతీశెట్టి. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రని ఆమె పండించిన తీరు, ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన నటన ఆడియెన్స్‌ని కట్టిపడేయడమే కాదు.. ఫిల్మ్ మేకర్స్ ఆమె చుట్టూ తిరిగేలా చేసింది. ఇప్పటికే నాని, నితిన్, సుధీర్ బాబు, రామ్, నాగచైతన్యలతో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మరో సూపర్బ్ ఆఫర్ ఒకటి పట్టేసినట్లు తెలుస్తోంది.
చిరంజీవి కూతురు సుస్మిత ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ తన బ్యానర్‌లో ఓ వెబ్ సిరీస్ కూడా తీశారామె. అయితే ఈ నిర్మాణ సంస్థను పెట్టింది కేవలం వెబ్ ప్రాజెక్టుల కోసం మాత్రమే కాదు.. సినిమా తీసే ప్లాన్స్ కూడా సుస్మితకు ఉన్నాయి. ఇప్పటికే ఆ దిశగా వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందట. టీమ్ ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌ను తయారు చేసిందని, ఆ చిత్రాన్నే మొదటగా తీయనున్నారని టాక్.
ఈ మూవీ విషయంలో సుస్మిత ఎంతో ఎక్సయిటెడ్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. తెలుగుతో పాటు తమిళంలోనూ తీస్తారట. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ పాత్ర కృతిని వరించినట్లు తెలిసింది. తనైతే ఆ పాత్రకి బాగా సూటవుతుందని, న్యాయం చేస్తుందని సుస్మిత నమ్మడం, కథను కృతికి వినిపిస్తే ఆమె వెంటనే అనడం కూడా జరిగిపోయాయని సమాచారం.
అదే నిజమైతే ఇండస్ట్రీలో కృతి మరో రేంజ్‌కి వెళ్లిపోవడం ఖాయం. ఎందుకంటే మెగా డాటర్ తీస్తున్న మూవీ. పైగా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఏ హీరోయిన్‌కైనా ఇంత త్వరగా తన భుజాలపై సినిమాని మోసే చాన్స్ రావడం కష్టమే. అలాంటిది కృతికి ఆ అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది! తన స్థాయి మరింత పెరిగిపోదూ!
This post was last modified on November 21, 2021 8:31 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…