టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. చాలా ఏళ్ల ఏళ్ల పాటు టాలీవుడ్ టాప్-4 హీరోల్లో ఒకడిగా ఉన్నాడు నాగ్. ఐతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి తర్వాతి తరం స్టార్ల హవా పెరిగాక నాగ్ తరం సీనియర్ హీరోల జోరు తగ్గింది. ఆపై జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలు కూడా ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి ముందు తరం సీనియర్ల ప్రాధాన్యాన్ని మరింత తగ్గించారు.
ఐతే ఇప్పుడు తమ రేంజ్ తగ్గినా.. ఒకప్పుడు వైభవం చూశామన్న ఇగో సీనియర్లలో ఉండక మానదు. అందుకే యంగ్ హీరోలను అనుకరించడమో.. వాళ్ల పాటలకు స్టెప్పులేయడమో చేయాల్సి వస్తే వారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నాగార్జున మాత్రం అలాంటి ఇగోలకు వెళ్లరు. ఎన్టీఆర్‌ను చూసి మాస్ నేర్చుకోమని అఖిల్‌కు చెప్పినా.. రామ్ చరణ్ ఎదుగుదల గురించి ‘బిగ్ బాస్’ షోలో గొప్పగా మాట్లాడినా నాగ్‌కే చెల్లింది.
ఇప్పుడు నాగ్ ఈ తరం సూపర్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బన్నీ కొత్త సినిమా ‘పుష్ఫ’ నుంచి ఈ మధ్యే ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ ఒక పాట రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు నాగ్ స్టెప్పులేయడం విశేషం. ‘బిగ్ బాస్’లో ఆదివారం ఎపిసోడ్లో భాగంగా నాగ్ ఈ పాటకు స్టెప్పులేస్తూ.. బన్నీని అనుకరించిన వీడియో ప్రోమోను ‘స్టార్ మా’ వాళ్లు షేర్ చేశారు. దీనిపై ‘పుష్ప’ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు కూడా స్పందించి.. నాగార్జునకు కృతజ్ఞతలు చెప్పడం విశేషం.
ఇక ‘బిగ్ బాస్’ విషయానికి వస్తే షో చివరి దశకు చేరువ అవుతుండటంతో డ్రామా బాగానే రక్తి కడుతోంది. శనివారం షన్ను-సిరిల రిలేషన్ మీద ఇద్దరికీ నాగ్ కొంచెం గట్టిగానే క్లాస్ పీకాడు. ఆదివారం ఎలిమేషన్ డే కాగా.. గత కొన్ని రోజుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న యానీ మాస్టర్ హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 21, 2021 3:17 pm
హిట్టు ఫ్లాపు పక్కనపెడితే ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు నార్త్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తన హిందీ…
భారత రాజకీయాల్లో మొనాటనీ రాజ్యమేలుంది,. ఇందుకు ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. చివరకు నీతి వాక్యాలు వల్లించే…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ కొత్త చిత్రం ‘లైలా’లో ఆకాంక్ష శర్మ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం…
ఏపీ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి సర్కారు మరో తీపి కబురు చెప్పింది.…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి ఓ రోజు షాక్ తగిలితే... మరో రోజు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. నాలుగు రోజుల…