నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. మొదలైన దగ్గర్నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఇటీవల ట్రైలర్ లాంచ్ అయ్యాక అంచనాలు మరింత పెంచేసింది. ఇంకో 12 రోజుల్లోనే ‘అఖండ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాస్త ముందుగానే సినిమాకు సెన్సార్ కూడా పూర్తి చేసేసింది చిత్ర బృందం.
‘అఖండ’కు చిత్ర బృందం అంచనా వేసినట్లే యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. బోయపాటి సినిమాలంటేనే విపరీతమైన హింసతో కూడి ఉంటాయి. కాబట్టి క్లీన్ యు అంటే కష్టమే. ఈ సినిమా రన్ టైం ఎంత అన్న సమాచారం కూడా బయటికి వచ్చేసింది. నిడివి కాస్త ఎక్కువే అని సమాచారం. 2 గంటల 37 నిమిషాలతో ఫైనల్ కట్ రెడీ చేశాడట బోయపాటి.
బాలయ్యతో ఇంతకుముందు బోయపాటి రూపొందించిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్’ సైతం అటు ఇటుగా ఈ నిడివితో రిలీజైన చిత్రాలే. ‘సింహా’ రన్ టైం 2 గంటల 36 నిమిషాలు కాగా.. ‘లెజెండ్’ 2 గంటల 41 నిమిషాల నిడివితో వచ్చింది. సినిమాలో యాక్షన్ ఘట్టాలే దాదాపు 45 నిమిషాలు సాగుతాయన్ని యూనిట్ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక రోజులు యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు నెలకొల్పినట్లు ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
సినిమాలో యాక్షన్ ఘట్టాలే హైలైట్‌గా ఉంటాయని ఈ మధ్య రిలీజైన ట్రైలర్ చూసినా అర్థమైపోతుంది. ‘లెజెండ్’ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఒక టెంప్లేట్ స్టయిల్లో బోయపాటి ఈ సినిమా తీసినట్లు కనిపిస్తోంది. సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్న అఖండ పాత్ర.. ‘లెజెండ్’లో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ లాగే సినిమా మధ్యలో రంగప్రవేశం చేస్తుందని.. ఆ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి అభిమానులకు గూస్ బంప్పే అని అంటున్నారు.
This post was last modified on November 20, 2021 12:13 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…