Movie News

చరణ్‌కు బన్నీకి చాలా తేడా ఉందే..

రామ్ చరణ్ కెరీర్లో ఎప్పటికీ ‘రంగస్థలం’ ఒక మైలురాయే. అప్పటిదాకా చరణ్ కెరీర్లో బ్లాక్‌బస్టర్లున్నాయి. హిట్లున్నాయి. కానీ నటుడిగా అతడికి ఏమంత గొప్ప పేరు లేదన్నది వాస్తవం. హావభావాల విషయంలో అతను చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాంటి వాడిలో నటుడిగా కొత్త కోణాల్ని ఆవిష్కరించి న్యూట్రల్ ఆడియన్స్‌లో ఒక యాక్సెప్టెన్స్ తీసుకొచ్చిన చిత్రం ‘రంగస్థలం.’ అందులో చిట్టిబాబుగా చరణ్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

చరణ్‌లో ఇంత మంచి నటుడున్నాడా అనిపించేలా అతడి నుంచి అద్భుత నటనను రాబట్టుకున్న ఘనత సుకుమార్‌కే చెందుతుంది. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి అలాంటి రా అండ్ రస్టిక్ స్టోరీతో సుక్కు ‘పుష్ప’ తీస్తున్నాడు. చరణ్‌ను చిట్టిబాబుగా నెవర్ బిఫోర్ క్యారెక్టర్, లుక్స్‌లో చూపించినట్లే అల్లు అర్జున్‌ను సైతం పుష్పగా సరికొత్త అవతారంలోకి మార్చాడు సుక్కు.

కాకపోతే ‘పుష్ప’కు సంబంధించిన ప్రోమోలు చూసినపుడల్లా సుకుమార్, అల్లు అర్జున్ ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ‘రంగస్థలం’ను ప్రతి విషయంలోనూ అనుకరిస్తూ.. ఇందులో డోస్ పెంచేస్తున్నారు. బన్నీ లుక్స్, మేనరిజమ్స్ విషయంలో మరీ శ్రుతి మించిపోయినట్లుగా అనిపిస్తోంది ప్రోమోలు చూస్తుంటే. ‘దాక్కో దాక్కో మేక’తో పాటు తాజాగా రిలీజ్ చేసిన ‘ఏయ్ బిడ్డా’ పాటల్లో బన్నీ హావభావాలు.. స్టెప్స్ విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రలో ఉన్న సహజత్వం.. పుష్పగా అల్లు అర్జున్‌లో కనిపించడం లేదు. చిట్టిబాబును మించిపోవాలి అనే తాపత్రయంలో పుష్ప లుక్స్.. మేనరిజంల విషయంలో బన్నీ మరీ అతి చేసినట్లుగా అనిపిస్తోంది. అతడి పాత్రను చూస్తుంటే తమిళ సినిమాల్లో హీరోలను గుర్తుకు తెస్తున్నాయి. ‘రంగస్థలం’ ఇరగాడేసింది కదా.. చిట్టిబాబు పాత్ర అంతగా నచ్చేసింది కదా అని ‘పుష్ప’ సినిమా, లీడ్ రోల్ విషయంలో సుక్కు-బన్నీ ఓవర్ ద టాప్ వెళ్లిపోయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి రేప్పొద్దున సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on November 19, 2021 10:05 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

38 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago