ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమవుతోంది. చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇలా చాలా మంది హీరోల విషయంలో దర్శకులు ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరేమో సీనియర్ హీరో సినిమా అంటే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య సరసన నటించడానికి శృతిహాసన్ ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. ఓ పక్క ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తూనే.. బాలయ్య సినిమాకి శృతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా శృతి హాజరైంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. దర్శకుడితో ఉన్న స్నేహం కారణంగానే శృతి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది. అయితే కొన్ని కండీషన్స్ కూడా పెట్టిందట శృతి. అవేంటంటే.. ఈ సినిమా కోసం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ అడిగింది. దానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. అలానే సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించనని చెప్పిందట.
డాన్స్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని.. కానీ ఎక్కువ హగ్గింగ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ పెట్టొద్దని దర్శకనిర్మాతలకు సూచించిందట. తన పాత్రను గౌరవప్రదంగా చూపించాలని.. గ్లామర్ షోకి ప్రాధాన్యత ఇవ్వొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. శృతి పెట్టిన ఈ షరతులన్నింటికీ గోపీచంద్ మలినేని అంగీకరించినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలకానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on November 19, 2021 12:41 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…