మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌ని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి అత్యధికంగా చర్చ జరిగింది ఒకే ఒక్క విషయం మీద. చిరు చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తారు అని. గ్యాంగ్‌స్టర్ అయిన హీరోకి, అతణ్ని అసహ్యించుకునే చెల్లెలికి మధ్య జరిగే సీన్సే ఈ సినిమాకి హైలైట్. చివరికి ఆ చెల్లెలు అన్నని సాయం కోరే సీన్ సినిమాకే ప్రాణం. అందుకే ‘గాడ్‌ఫాదర్’లో ఆ రోల్ ఎవరిని వరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకి ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే గాడ్‌ఫాదర్‌కి చెల్లెలిగా నయనతార ఫిక్సయ్యింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని టీమ్ కన్‌ఫర్మ్ చేసింది. అయితే చెల్లెలి క్యారెక్టర్ అని చెప్పకుండా తమ చిత్రంలో నయన్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని మాత్రమే చెప్పారు. ఈ సినిమాలో కీలకమైన లేడీ క్యారెక్టర్ అంటే కచ్చితంగా అది మంజు వారియర్ పోషించిన పాత్రే.
‘సైరా’లో చిరుకి జోడీగా నటించిన నయనతారని ఆయన చెల్లెలి పాత్రలో చూడటం ఫ్యాన్స్‌కి అంతగా నచ్చకపోవచ్చు. నిజానికి ఎవరూ ఫీలవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్లిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లే అయినా కథానుసారం ఎక్కడా ఆ రిలేషన్‌ని కన్‌ఫర్మ్ చేయరు. అన్నా చెల్లీ అనే పిలుపులు కూడా ఉండవు. కాబట్టి తెరపై ఇద్దరినీ చూస్తే బలమైన పాత్రల్లా అనిపిస్తారే తప్ప అన్నాచెల్లెళ్లు అనే ఫీలింగ్ కలగదు. బహుశా నయన్‌ని తీసుకునేముందు ఈ యాంగిల్‌లో కూడా ఆలోచించే ఉంటారు మేకర్స్.
ఏదేమైనా కానీ ఈ క్యారెక్టర్‌కి నయన్ పర్‌ఫెక్ట్ యాప్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పాత్ర చాలా హుందాగా ఉంటుంది. సీరియస్‌గా ఉంటుంది. డేరింగా డ్యాషింగ్‌గా కనిపిస్తుంది. సటిల్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇంటెలిజెన్స్, ఇండివిడ్యువాలిటీ ఉన్న మహిళ తను. అందుకే మలయాళంలో మంజు వారియర్ లాంటి స్టార్ హీరోయిన్‌ని తీసుకున్నారు. కాబట్టి తెలుగులో కూడా నయన్ లాంటి స్టార్ హీరోయిన్ చేయడమే కరెక్ట్. అయితే తన పాత్ర హీరో పాత్రకి తీసిపోనట్టుగా ఉంటేనే నయన్ ఎస్ అంటుంది. కాబట్టి పాత్ర నిడివిని పెంచే చాన్స్ ఉంది. ఏదేమైనా ఇన్నాళ్లకి గాడ్ ఫాదర్‌కి చెల్లెలి సమస్య తీరిపోయింది.
This post was last modified on November 18, 2021 10:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…