హీరో సెట్టయ్యాడు. దర్శకుడూ సెట్టయ్యాడు. సంగీత దర్శకుడి దగ్గర నుంచి అందరూ సెట్టయ్యారు. సినిమా సెట్స్‌కి కూడా వెళ్లిపోయింది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయినా హీరో చెల్లెలి పాత్రకి మాత్రం నటి సెట్ కావట్లా. వినడానికి కాస్త విడ్డూరంగానే ఉన్నా ‘గాడ్ ఫాదర్’ విషయంలో ఇదే జరుగుతోంది.
మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ ఈ సినిమా. మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశాడు మోహన్ రాజా. ఆ మార్చే క్రమంలో కొత్త క్యారెక్టర్లను ఈజీగా యాడ్ చేశాడు కానీ, ఉన్న క్యారెక్టర్లను తీసేసే చాన్స్ మాత్రం లేదు. ఎందుకంటే ఈ మూవీ మొత్తం క్యారెక్టర్ల మీదే బేస్ అయ్యి ఉంటుంది. ముఖ్యంగా చెల్లెలి పాత్ర. అదే కథకి ఆయువుపట్టు. ఒరిజినల్‌లో మంజు వారియర్ అద్భుతంగా పోషించిన ఆ పాత్రకి తెలుగులో ఇంతవరకు నటి ఫిక్స్ కాలేదు.
హీరోని అసహ్యించుకునే చెల్లెలు, ఆ తర్వాత తన అన్న ఎంత గొప్పవాడో తెలుసుకుంటుంది. అతని సహాయం కోరుతుంది. ఆమె కోసం ఆ అన్న పెద్ద యుద్ధాన్నే చేస్తాడు. అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కనుక నయనతారను అడిగారని, ఆమె నో అందని అన్నారు. ఆ తర్వాత సుహాసిని, విద్యాబాలన్ లాంటి పేర్లు చాలానే వినిపించాయి. చివరికి ఆ లిస్టు రమ్యకృష్ణ దగ్గరకు వచ్చి ఆగింది. శివగామిగా అదరగొట్టిన ఆమె అయితేనే హుందాగా ఉండే ఈ పాత్రకి పర్‌ఫెక్ట్ అని టీమ్ ఫీలవుతోందట. ఆమెనే తీసుకోబోతున్నారని లేటెస్ట్ టాక్.
అయితే ఇప్పటికే ఇలాంటి పేర్లు చాలా వినిపించాయి కాబట్టి ఇది కూడా నమ్మడం కష్టమే. అయినా ఒరిజినల్‌లో లేని హీరోయిన్ పాత్రని తెలుగులో సృష్టించి, దానికి అనుష్కని కూడా సెలెక్ట్ చేసుకున్నారని అంటున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన చిన్న రోల్‌కి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోని సెట్ చేశారు. చిరు, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేసే సిచ్యుయేషన్‌ని సృష్టించి, ఆ పాటను వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్తో పాడిస్తున్నారు. ఇన్ని చేయగలిగిన దర్శక నిర్మాతలు చెల్లెలి గండాన్ని మాత్రం దాటలేకపోతున్నారేంటో మరి!
This post was last modified on November 16, 2021 11:04 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…