కెరీర్ మొదలుపెట్టి పదేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ సరైన బ్రేక్ రాక కష్టపడుతూనే ఉంది క్యాథరీన్ థ్రెసా. చెప్పుకోడానికి చాలా సినిమాలే చేసింది. కానీ ఆమె గురించి అందరూ చెప్పుకునేంత ప్రామిసింగ్ రోల్స్ అయితే దక్కలేదు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో రెండు సినిమాలు చేసినా టాలీవుడ్‌లో సరైన పొజిషన్ దక్కలేదు.
అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నట్టున్నాయి క్యాథరీన్‌కి. ఇప్పటికే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘భళా తందనాన’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోందామె. కళ్యాణ్ రామ్ భారీ ఎత్తున తీస్తున్న ‘బింబిసార’ మూవీలోనూ నటిస్తోంది. ఇప్పుడు నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’లో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఇవాళ షూట్‌లో కూడా జాయినయ్యింది. ఆ విషయాన్ని టీమ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది.
కానీ పాపం ఇందులోనూ సెకెండ్ హీరోయిన్‌గానే సెలెక్టయ్యింది క్యాథరీన్. ఆల్రెడీ ఈ మూవీలో కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌గా క్యాథీకి చాన్స్ దక్కింది. భళా తందనానలో ఆమె సోలో హీరోయిన్ అయినా, బింబిసారలో మాత్రం మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. ఇప్పటికే చాలా సినిమాల్లో సెకెండ్ లీడ్‌గానే కనిపించడంతో ఆ సినిమాలు హిట్టయినా క్యాథరీన్‌కి క్రెడిట్ దక్కలేదు. అయినా ఇప్పటికీ ఆమెని అలాంటి పాత్రలే వరిస్తున్నాయి. ఇలా అయితే కోరుకున్న స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందో ఏమో!
This post was last modified on November 16, 2021 10:50 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…