యువి క్రియేషన్స్.. ఈ పేరెత్తితే మంటెత్తి పోతున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ కోపం ఈనాటిది కాదు. సాహో రోజుల నుంచి ఉంది. ఆ సినిమా మేకింగ్ టైంలో సమయానికి అప్‌డేట్స్ ఇవ్వట్లేదని.. ప్రమోషన్లు సరిగా చేయట్లేదని.. అభిమానుల ఆకాంక్షలు అస్సలు పట్టవని వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుకుని.. యువి ఆఫీస్ దగ్గరికెళ్లి ఆందోళన చేసే వరకు పరిస్థితి వెళ్లింది. అయినా సరే.. రాధేశ్యామ్ విషయంలోనూ యువి వాళ్లు ఇదే ఒరవడి కొనసాగిస్తున్నారన్నది వాళ్ల ఆరోపణ.
అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ గొడవ చేయడం.. యువి వాళ్లు సైలెంటుగా ఉండటం.. ఈ ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం కుదిరింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. కానీ ముహూర్త సమయానికి అనుకున్నది జరగలేదు.
సోమవారం సాయంత్రం 5 గంటలకు పాట రిలీజ్ కావాల్సి ఉండగా.. అనుకున్న సమయానికి పాటను లాంచ్ చేయలేకపోయింది యువి క్రియేషన్స్. ముందేమో కొంచెం ఆలస్యం అన్నారు. తర్వాతేమో రాత్రి 8 గంటలకు పాట వస్తుందన్నారు. కానీ ఆ సమయానికి కూడా పాట రాలేదు. గంటలు గంటలు ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. యువి వాళ్లను బూతులు తిడుతూ.. మీమ్స్ వేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
చివరికి యువి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి 9 గంటలకు కూడా పాట రిలీజ్ కాలేదు. కాసేపటికి యూట్యూబ్‌లో నేరుగా పాటను రిలీజ్ చేస్తే.. వేరే హ్యాండిల్స్ నుంచి ట్విట్టర్లో పాట పోస్ట్ అయింది. ఇక యువి మీద ప్రభాస్ అభిమానులు కోపం చూడాలి. ఈ క్రమంలో ఓ అభిమాని హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి.. తమ మనోభావాలతో ఆడుకుంటున్న యువి అధినేతల్ని అరెస్ట్ చేయమని కోరాడు. దానికి ఆ హ్యాండిల్ నుంచి బదులు రావడం విశేషం. లోకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా పోలీస్ హ్యాండిల్ సూచించగా.. అభిమానులు ఈ ట్వీట్‌ను వైరల్ చేశారు.
This post was last modified on November 16, 2021 9:57 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…