ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా హీరోగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా టీజర్, పాట విడుదలైనప్పుడు మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమాలో రానా నక్సలైట్ రోల్ అనేసరికి ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. సాయి పల్లవిని హీరోయిన్ నటించడంతో కచ్చితంగా సినిమాలో కొత్తదనం ఉంటుందని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గుతోంది. షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాయి.. ఇంకా సినిమాను రిలీజ్ చేయడం లేదు. నిర్మాత సురేష్ బాబు ‘విరాటపర్వం’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలా..? లేక థియేటర్లో విడుదల చేయాలా..? అనే విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఓటీటీలో రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ల నుంచి విమర్శలు వస్తాయని ఆలోచిస్తున్నారు. అందుకే ‘భీమ్లా నాయక్’ రిలీజైన తరువాత ‘విరాటపర్వం’ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు.
ప్రస్తుతానికైతే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి వస్తుందని అంటున్నారు. లేదంటే మార్చి లేదా ఏప్రిల్ కి వాయిదా పడే ఛాన్స్ ఉంది. ‘సంక్రాంతికే సినిమా వస్తే రానాకి హెల్ప్ అవుతుంది. అప్పుడు ‘విరాటపర్వం’ సినిమాను థియేటర్లో విడుదల చేసుకుంటారు. లేదంటే ఓటీటీ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా రిలీజ్ బాగా ఆలస్యమైంది. ఇంకా లేట్ చేస్తే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 16, 2021 9:29 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…