సమంత సినీ, వ్యక్తిగత జీవితం మీద ఇప్పుడు అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నాగచైతన్య నుంచి ఆమె విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ మధ్యే ఆ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ సమంత అభిమానులను చాలా బాధ పెట్టింది. వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నతో అందరూ సమంత వైపు చూస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురు దెబ్బకు.. సినిమాలతోనే మందు రాయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వివిధ భాషల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ కెరీర్‌ను పొడిగించుకోవడానికి ఆమె డిసైడైపోయింది.
ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. చైతూ నుంచి విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నాక ఆమె చేసిన తొలి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైపోవడం గమనార్హం. అది ఓ తమిళ చిత్రం. దాని పేరు.. కాతువాకుల రెండు కాదల్.
నయనతార కాబోయే భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సమంతతో పాటు నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించడం విశేషం. ఈ వెరైటీ కాంబినేషన్లో సినిమా అనేసరికి ముందు నుంచి ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూట్ టైంలో లీక్ అయిన ఒక సన్నివేశం క్యూరియాసిటీని పెంచింది. సేతుపతి, సమంత, నయన కలిసి ఒక ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న దృశ్యమది. ఇదొక వెరైటీ లవ్ స్టోరీ అని, విఘ్నేష్ శివన్ స్టయిల్లో ఫన్నీగా ఉంటుందని అంటున్నారు.
ఈ చిత్రంలో సామ్ ఖటీజా అనే వెరైటీ క్యారెక్టర్ చేస్తోంది. తన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుందని కూడా ప్రకటించారు. కొన్ని నెలల నుంచి సమంత వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుకుంటున్న జనాలు ఇక ఆమె సినిమా గురించి మాట్లాడుకునే టైం వచ్చేసింది. చైతూ నుంచి విడిపోయాక సామ్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడం కూడా దీనిపై ఆసక్తిని పెంచేదే.
This post was last modified on November 16, 2021 8:40 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…