స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. 2019 డిసెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టారు. అంటే దాదాపు రెండేళ్లు అయిపోయింది.
రెండు లాక్ డౌన్స్ వచ్చినప్పటికీ.. సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. ఫైనల్ గా 2022, జనవరి 6న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ అదే సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అందులో కూడా అలియానే హీరోయిన్ గా నటించింది.
దీంతో రాజమౌళి రంగంలోకి దిగి దర్శకుడు భన్సాలీని, నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ను ‘గంగూబాయి’ సినిమాను వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. దీనిపై పలు చర్చలు జరిగిన అనంతరం పెన్ స్టూడియోస్ సంస్థ తమ సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించింది.
తాజాగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2022, ఫిబ్రవరి 18న ‘గంగూబాయి కథియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను బాలీవుడ్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ చేసుకోవచ్చు.
తన రిక్వెస్ట్ ను కన్సిడర్ చేయడంతో రాజమౌళి ట్విట్టర్ వేదికగా ‘గంగూబాయి’ దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
This post was last modified on November 15, 2021 4:38 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…