బిగ్ బాస్ షోను ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు.. దాని గురించి తేలిగ్గా మాట్లాడేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఆ షోను ఫాలో అయ్యేవాళ్లకు మాత్రం దాన్ని మించిన ఎంటర్టైన్మెంట్ కనిపించదు. అలా ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య చాలా పెద్దదని.. సోషల్ మీడియాలో బిగ్ బాస్ చర్చలు చాలా జోరుగా జరుగుతుంటాయని.. ఎక్కువమంది ఆదరణ సంపాదించుకున్న కంటెస్టెంట్లకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ మామూలుగా ఉండదని చెప్పడానికి ఎప్పటికప్పుడు రుజువులు కనిపిస్తుంటాయి.
స్టార్ హీరోలు.. పెద్ద సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌ను మించి బిగ్ బాస్ టాపిక్స్ మీద పెట్టే హ్యాష్ ట్యాగ్స్ భారీ స్థాయిలో ట్రెండ్ కావడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షో ఐదో సీజన్లో ఓ కంటెస్టెంట్‌కు అనుకూలంగా పెట్టిన ఓ హ్యాష్ ట్యాగ్ మీద 6 లక్షల ట్వీట్లు పడ్డాయంటే నోరెళ్లబెట్టాల్సిందే.
బిగ్ బాస్-5లో అడుగు పెట్టినపుడే ఫేవరెట్లలో ఒకడిగా కనిపించిన వ్యక్తి షణ్ముఖ్ అలియాస్ షన్ను. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అతను.. షోలోనూ బాగానే అభిమానులకు ఆకట్టుకున్నాడు. ముందు నుంచే టైటిల్‌కు గట్టి పోటీదారుల్లో ఒకడిగా షన్నును పరిగణిస్తున్నారు. గత కొన్ని రోజుల్లో తన ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. ఇప్పుడు MrcoolShannu పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి తన ఫ్యాన్స్ ట్విట్టర్లో ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ హ్యాష్ ట్యాగ్ మీద దాదాపు 6 లక్షల ట్వీట్లు పడటం విశేషం.
బిగ్ బాస్ షో మధ్యలో ఒక పోటీదారుకు అనుకూలంగా ఈ స్థాయిలో ట్వీట్లు పడటం.. నేషనల్ లెవెల్లో ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం అరుదైన విషయమే. చివరగా కౌశల్ విషయంలో ఇలాంటి ఫాలోయింగ్ కనిపించింది. ఈ ఊపు చూస్తుంటే షన్నునే ఐదో సీజన్ టైటిల్ విన్నర్ అయ్యేలా కనిపిస్తున్నాడు. మానస్, సన్నీ లాంటి వాళ్లు అతడికి ఏమేర పోటీనిస్తారో చూడాలి.
This post was last modified on November 14, 2021 8:12 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…