ఒకప్పుడు హీరోయిన్లు బొద్దుగా, ముద్దుగా ఉండేవారు కానీ ఇప్పుడు అలా కాదు. జీరో సైజ్ అనే ట్రెండ్ రావడంతో ప్రతి ఒక్కరూ తమ ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. గంటల తరబడి జిమ్ లో వ్యాయామాలు చేస్తూ పెర్ఫెక్ట్ షేప్ కోసం ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కూడా వర్కవుట్ చేస్తుంటుంది. ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూనే తన ఫిజిక్ ను మెయింటైన్ చేసుకుంటుంది. కానీ అందరిలా ఎక్కువ సమయం జిమ్ లో గడపదట ఈ బ్యూటీ.
ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.. ‘పైలేట్స్ ఎక్సర్ సైజ్’. పూజా ఎక్కువసేపు ఈ వ్యాయామం చేస్తుందట. జిమ్ కి వెళ్లినా, వెళ్లకపోయినా ఇంట్లోనే పైలేట్స్ సెషన్స్ చేస్తుంది. ఒక్కరోజు కూడా ఈ సెషన్ మిస్ అవ్వదట. ముంబైలో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా.. రోజులో కొంత సమయం పైలేట్స్ సెషన్ కోసం కేటాయిస్తుంది. అలానే యోగా ఎక్కువగా చేస్తుంటుంది. అందుకే తన ఫిజిక్ ను పెర్ఫెక్ట్ గా కాపాడుకోగలుగుతుంది. ఇంకెందుకు లేటు.. మీరు కూడా పైలేట్స్ ఎక్సర్ సైజ్ ట్రై చేయండి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి నెలలో ‘రాధేశ్యామ్’, ఫిబ్రవరిలో ‘ఆచార్య’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో పూజా సందడి చేయబోతుందన్నమాట. ఇక ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’లో నటిస్తోన్న ఈ బ్యూటీ.. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా సైన్ చేసింది. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి.
This post was last modified on November 12, 2021 7:21 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…