మెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్ లో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని ఊటీలో పూర్తి చేశారు. చిరు చేతికి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మలయాళ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకుంటారనే విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఆ రోల్ కోసం ఫైనల్ చేశారని అన్నారు. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అలానే సినిమాలో ఓ పాట కోసం హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ను సంప్రదిస్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాలన్నింటిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు.
ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. చిరు ‘గాడ్ ఫాదర్’ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేసే పాట కాబట్టి దాని స్థాయికి తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రిట్నీ స్పియర్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా..? లేక మరేదైనానా అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాక ఓ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి సినిమాలో సల్మాన్ నటించబోతున్నాడని.. చిరుతో కలిసి డాన్స్ కూడా చేస్తాడని క్లారిటీ వచ్చేసింది.
This post was last modified on November 11, 2021 12:35 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…