ఇండియా ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు మోహన్ లాల్. కంటెంట్, కలెక్షన్ల రెంటి పరంగానూ మలయాళ ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకు సొంతం. మాలీవుడ్లో కలెక్షన్ల పరంగా మేజర్ రికార్డులన్నీ మోహన్ లాల్ పేరిటే ఉంటాయి. ఐతే వేరే భాషల్లో సూపర్ స్టార్లతో పోలిస్తే మోహన్ లాల్‌ను భిన్నంగా నిలబెట్టేది మాత్రం ఆయన ఎంచుకునే కథలు, పాత్రలే. ఆయనకు ఇతర స్టార్ల మాదిరి ఇమేజ్ బంధనాలు ఉండవు.
పంచె కట్టుకుని, ఫైట్లేమీ చేయకుండా చాలా మామూలుగా సాగిపోయే పాత్రలను కూడా ఏ అభ్యంతరాలు లేకుండా చేసేస్తారు. ఒక సామాన్యుడిలా కనిపిస్తూ కూడా అలరిస్తారు. ఆ సినిమాలను బ్లాక్‌బస్టర్లను చేసేస్తారు. ఓవైపు క్వాలిటీ విషయంలో రాజీ పడకుండానే.. ఇమేజ్ లేని చిన్న హీరోల మాదిరి ఏడాదికి మూణ్నాలుగు సినిమాలు లాగించేయడం మోహన్ లాల్‌కే చెల్లు. ఈ విషయంలో ఆయన ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలుస్తాడు.
‘మరక్కార్’ లాంటి భారీ చిత్రాన్ని కొన్ని నెలల్లోనే పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడం మోహన్ లాల్‌కే చెల్లింది. కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమై త్వరలోనే ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది. ఇక గత ఏడాది చివర్లో చడీచప్పుడు లేకుండా ‘దృశ్యం-2’ సినిమాను మొదలుపెట్టి నెలన్నరలో పూర్తి చేసి చకచకా విడుదలకు సిద్ధం చేశాడు లాలెట్టన్. ఇంత వేగంగా చేశాడు సినిమాలో ఏం క్వాలిటీ ఉంటుందో అని సందేహిస్తే అదిరిపోయే కంటెంట్‌తో ఆ సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వెంటనే లాల్ ‘బరోజ్’ అనే భారీ మైథలాజికల్ మూవీని స్వీయ దర్శకత్వంలో మొదులపెట్టి చకచకా లాగించేస్తున్నాడు లాల్. దాంతో ‘దృశ్యం’ దర్శకుడు జీతు జోసెఫ్‌తో ‘ట్వల్త్ మ్యాన్’ అనే థ్రిల్లర్ మొదలుపెట్టాడు. అలాగే తనతో ‘లూసిఫర్’ తీసిన నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వంలో ‘బ్రో డాడీ’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఈ రెండూ పూర్తి కావస్తుండగానే ఇటీవల షాజీ కైలాస్ దర్శకత్వంలో ‘అలోన్’ అనే సినిమా ప్రకటించాడు.
అది చేస్తూనే ఇప్పుడు ‘పులి మురుగన్’ డైరెక్టర్ వైశాఖ్‌తో ‘మాన్‌స్టర్’ అంటూ కొత్త సినిమా ప్రకటించాడు. ఈ వయసులో ఇంత తీరిక లేకుండా, ఇంత వేగంగా లీడ్ రోల్స్‌లో సినిమాలు చేయడం.. ప్రతి సినిమాలో క్వాలిటీ చూపించడం ఇంకెవరికీ సాధ్యం కాని విషయం. ఈ విషయంలో ఎవరితోనూ పోల్చడానికి కూడా అవకాశం లేదు. ఇలా మోహన్ లాల్‌కు మాత్రమే ఎలా సాధ్యమవుతోందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు.
This post was last modified on November 10, 2021 6:12 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…