ప్రపంచ సినీ చరిత్రలో ఏది గొప్ప సినిమా.. ఈ ఏడాదికి అంతర్జాతీయ స్థాయిలో ఏది బెస్ట్ మూవీ.. ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే అందరూ చూసేది ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)నే. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగానే ఇక్కడ సినిమాలకు రేటింగ్ ఇస్తుంటుందీ సంస్థ. అభిప్రాయాలను క్రోడీకరించి అందరికీ ఆమోదయోగ్యంగా అనిపించేలాగానే ఆ సంస్థ రేటింగ్స్ ప్రకటిస్తుంటుంది. అందుకే చాలామంది దాన్ని అనుసరిస్తారు. ఈ జాబితాలో దశాబ్దాల నుంచి ‘షావ్‌షాంక్ రిడెంప్షన్’ అగ్ర స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఐతే కొత్తగా రిలీజయ్యే సినిమాలు జనాలకు తెగ నచ్చేస్తే.. పదికి పది రేటింగ్స్ ఇచ్చేసి ఆల్ టైం టాప్ లిస్టులో తీసుకెళ్లి పైన కూర్చోబెట్టేస్తుంటారు. తాత్కాలికంగా అయినా ఇలా కొన్ని కొత్త చిత్రాలు అగ్ర స్థానాన్ని అలంకరిస్తుంటాయి. గత వారం విడుదలైన తమిళ చిత్రం ‘జై భీమ్’ ఈ గౌరవాన్నే దక్కించుకుంది. ఓవరాల్ రేటింగ్‌లో ‘షావ్‌షాంక్ రిడెంప్షన్’ 9.3 రేటింగ్‌తో అగ్ర స్థానంలో ఉండగా.. ‘జై భీమ్’ 9.6 రేటింగ్‌తో అగ్ర స్థానానికి చేరడం విశేషం. 53 వేల మందికి పైగా ‘జై భీమ్’కు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా దీనికి తాత్కాలికంగా అగ్రస్థానం దక్కింది.
ఐతే ఈ రేటింగ్ తాత్కాలికమే అని భావించవచ్చు. గతంలో ‘1 నేనొక్కడినే’ లాంటి చిత్రాలు సైతం రిలీజ్ టైంలో ఐఎండీబీలో టాప్-5 లిస్టులో చోటు సంపాదించినవే. కాల క్రమంలో ఓటింగ్స్ పెరిగేకొద్దీ సగటు రేటింగ్ తగ్గుతుంది. ‘షావ్‌షాంక్ రిడెంప్షన్’ లాంటి చిత్రాలకు కోట్ల మంది ఇచ్చిన రేటింగ్స్ సగటు తీసి ఫైనల్ రేటింగ్ ఇచ్చి ఉంటారు. ఇలా అది 9.3 సగటు రేటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ సినిమా తర్వాత ది గాడ్ ఫాదర్ (9.2), ది డార్క్ నైట్ (9.1), ది డార్క్ ఫాదర్ (9.0) వరుస క్రమంలో ఉన్నాయి.
This post was last modified on November 10, 2021 10:59 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…