గత ఏడాది మార్చిలో కరోనా ప్రభావం మొదలయ్యాక గత 20 నెలల్లో భారీ చిత్రాలు బాగా కరవైపోయాయి. తెలుగు వరకు చూసుకుంటే ‘వకీల్ సాబ్’ మినహాయిస్తే ఏ భారీ చిత్రమూ విడుదల కాలేదు. థియేటర్లలో పెద్ద హీరోలు నటించిన మాస్ సినిమాల సందడి లేక ప్రేక్షకులు ఒక రకమైన నైరాశ్యంలో ఉన్నారు. ‘వకీల్ సాబ్’ కాకుండా ‘క్రాక్’ మాత్రమే మాస్ ప్రేక్షకులకు కొంచెం ఉత్సాహాన్నిచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత అయితే మాస్ సినిమాల సందడి అసలే లేకపోయింది.
‘సీటీమార్’ మాత్రమే కాస్త సందడి చేసింది. ‘లవ్ స్టోరి’తో థియేటర్లలో సందడి కనిపించింది కానీ.. అవి పక్కా క్లాస్ సినిమాలు. మాస్ ప్రేక్షకుల్లో కదలిక తెచ్చేవి కావు. ‘లవ్ స్టోరి’ తర్వాత రెండు నెలల వ్యవధిలో ఆ స్థాయిలో సందడి చేసే సినిమాలేవీ లేవనే చెప్పాలి. ఐతే డిసెంబర్లో మాత్రం కథ మారబోతోంది. ఇప్పుడు అంచనా వేస్తున్నట్లుగా నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ’ డిసెంబరు మొదటి వారంలో రిలీజైతే సందడే సందడి అన్నమాటే.
డిసెంబరులో తర్వాతి మూడు వారాలకు క్రేజీ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్న నేపథ్యంలో డిసెంబరు 2న ‘అఖండ’ వచ్చే అవకాశాలే మెండు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయని.. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైతే ఇక బాక్సాఫీస్ మోత మామూలుగా ఉండదు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాతో మాస్ సెంటర్లు షేక్ అయిపోవడం ఖాయం.
ఆ తర్వాతి వారం రానున్న ‘గని’ మీదా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక డిసెంబరు 17న రాబోతున్న ‘పుష్ప’ గురించి చెప్పాల్సిన పని లేదు. క్రిస్మస్ ముంగిట ‘శ్యామ్ సింగరాయ్’ వస్తుంది. ఇక జనవరిలో ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల సందడి ఉండనే ఉంది. అన్ సీజన్ అనదగ్గ ఫిబ్రవరిలోనూ ఆచార్య, ఎఫ్-3 లాంటి క్రేజీ సినిమాలున్నాయి. మార్చిలో ఎలాగూ వేసవి సినిమాల సందడి మొదలవుతుంది. కాబట్టి ‘అఖండ’ ఖరారైతే బాక్సాఫీస్ సందడి మరో స్థాయికి చేరబోతున్నట్లే.
This post was last modified on November 10, 2021 10:56 am
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…