బిగ్ బాస్ షోను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఏముందా షోలో అని తీసి పడేస్తుంటారు. కానీ కొందరికి మాత్రం ఆ షో అంటే పిచ్చి. సీజన్ మొదలైందంటే ఒక్క ఎసిసోడ్ కూడా వదలకుండా చూసేస్తుంటారు. ముందు ఈ షో పట్ల వ్యతిరేక భావం ప్రదర్శించిన వాళ్లు కూడా అనుకోకుండా షోను ఫాలో అయ్యి.. తర్వాత దాని మత్తులో పడిపోవడం చూస్తుంటాం.
‘బిగ్ బాస్’ కాన్సెప్టే తనకు నచ్చదన్న అక్కినేని నాగార్జున మూడు సీజన్ల నుంచి ఈ షోను నడిపిస్తుండటం ఇక్కడ గమనార్హం. షో పట్ల ఆయన ఆలోచన మారిందా.. లేక డబ్బు కోసం చేస్తున్నారా అన్నది పక్కన పెడదాం. కానీ సెలబ్రెటీల్లో కూడా చాలామంది ‘బిగ్ బాస్’ షోను చూసేవాళ్లే. కరోనా టైంలో రియల్ హీరోగా మారిన నటుడు సోనూ సూద్ సైతం ‘బిగ్ బాస్’ లవరేనట. అతను ‘బిగ్ బాస్’ చూస్తుంటాడట. ఐతే సోనూ చూస్తున్నాడంటే అది కచ్చితంగా హిందీ వెర్షనే అయ్యుంటుందని అనుకుంటాం.
కానీ సోనూ చూస్తున్నది తెలుగు బిగ్ బాస్ కావడమే ట్విస్టు. ఈ షోలో అతడి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా వెల్లడించడం విశేషం. గాయకుడు శ్రీరామచంద్రకు సోనూ తన మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు అతను రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. “బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్. అతడికివే నా ప్రేమాభినందనలు.. లవ్ యూ మ్యాన్” అని సోనూసూద్ ఈ వీడియోలో పేర్కొన్నాడు.
సోనూ లాంటి రియల్ హీరో శ్రీరామ్‌కు సపోర్ట్ చేయడం అతడికి బాగా కలిసొచ్చే విషయమే. షోలో శ్రీరామ్‌కు సోనూ ఎక్కువ కనెక్ట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అతను ఇండియన్ ఐడల్ విన్నర్‌గా చాలా ఏళ్ల ముందే నార్త్‌లో సూపర్ పాపులారిటీ సంపాదించాడు. సోనూతో అతడికి పరిచయం కూడా ఉన్నట్లుంది. అందుకే ఇలా శ్రీరామ్‌కు మద్దతుగా సోనూ వీడియో బైట్ ఇచ్చినట్లున్నాడు.
This post was last modified on November 10, 2021 10:48 am
ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడమనే సంప్రదాయం 2023లో మైత్రి సంస్థ విజయవంతంగా…
ఒలిపింక్స్ అంటేనే... వరల్డ్ క్లాస్ ఈవెంట్. దీనిని మించిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఈవెంట్ లో విజేతలకు…
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎందుకనో గానీ ఇటీవలి కాలంలో ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు.…
పండగ పేరునే సినిమా టైటిల్ పెట్టుకుని రావడం అరుదు. అందులోనూ స్టార్ హీరో అంటే ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ప్రకటన…
ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్…
ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్…