స్పెషల్ సాంగ్స్ తీసుకురండి: పూజాహెగ్డే

ఒకప్పుడు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి సెపరేట్ గా నటీనటులు ఉండేవారు. కానీ మెల్లగా హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ లో నటించడం మొదలుపెట్టారు. దీంతో ఐటమ్ భామల అవసరం లేకుండా పోయింది. ఒక్కో పాట కోసం కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ స్టార్ హీరోయిన్లను తీసుకొస్తున్నారు. అయితే బిజీగా ఉండే హీరోయిన్లు మాత్రం ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి ఇష్టపడరు. కానీ పూజాహెగ్డే మాత్రం స్పెషల్ సాంగ్స్ ఉంటే తీసుకురండి అని చెబుతోంది.

ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతోంది పూజాహెగ్డే. షూటింగ్ వలన ఒక్కోసారి నిద్ర కూడా ఉండదని చెప్పింది ఈ బ్యూటీ. అలాంటిది స్పెషల్ సాంగ్స్ కోసం కూడా సమయం కేటాయిస్తానని చెప్పడం విశేషం. ఇప్పటివరకు తన మనసుకి నచ్చినవి చేసుకుంటూ వెళ్లానని.. ఓ మంచి సాంగ్ ఉందంటే కచ్చితంగా చేస్తానని.. స్పెషల్ సాంగ్స్ ఉంటే తీసుకురమ్మని.. నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటోంది.

‘ఆచార్య’ సినిమాలో కూడా తను చేసింది ప్రత్యేక పాత్ర అని.. కేవలం క్యారెక్టర్ నచ్చడం వలనే ఒప్పుకున్నానని చెప్పింది. నీలాంబరి పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని.. విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు కాబట్టి నటించానని.. పైగా అది పెద్ద ప్రాజెక్ట్ అని.. అలాంటి సినిమాలు మిస్ చేసుకోకూడదని తెలిపింది. రోల్ చిన్నదే అయినా.. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ సినిమా అయితే కచ్చితంగా చేస్తానని చెబుతోంది.