‘ఈరోజుల్లో’, ‘బస్ స్టాప్’ వంటి చిన్న సినిమాలతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు మారుతి. ఆ తరువాత మెల్లగా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వెంకటేష్ లాంటి స్టార్ ని కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. నిజానికి మారుతి ప్రయత్నిస్తే.. ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకొస్తారు. కానీ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రావడం లేదు. గతంలో అల్లు అర్జున్ హీరోగా మారుతి ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది సెట్స్ పైకి వెళ్లలేదు.
మారుతి-బన్నీ మంచి స్నేహితులు. ఎప్పటికైనా.. బన్నీతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు మారుతి. ఇంతలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ఫిక్సైంది. ప్రస్తుతం ఈ సినిమా కథ మీద వర్క్ చేస్తున్నారు మారుతి. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ లో మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సినిమా ఉంటుందని అన్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని మారుతి ఎంతవరకు హ్యాండిల్ చేయగలరనే సందేహాలు తలెత్తాయి.
తాజాగా ఈ సినిమా గురించి మారుతి మాట్లాడారు. ప్రభాస్ తో సినిమా చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని.. తనెప్పుడూ హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకోనని.. తన కథకు ఎవరైతే బాగుంటారో.. వాళ్ల దగ్గరకు వెళ్తానని చెప్పారు. ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. తనకు కూడా ఆ కోరిక ఉందని అన్నారు. మంచి కథ దొరికితే కచ్చితంగా ప్రభాస్ ని సంప్రదిస్తానని.. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
This post was last modified on November 8, 2021 11:21 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…