‘మహర్షి’ సినిమాకు పని చేసిన ఫేమస్ కెమెరామన్ మోహనన్ తనయురాలైన మాళవిక మోహనన్.. తెలుగులో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ మన కుర్రాళ్లలో ఆమెకున్న ఫాలోయింగే వేరు. బాలీవుడ్లో దిశా పఠాని తరహాలో కేవలం హాట్ హాట్ ఫొటో షూట్లతోనే సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన అమ్మాయి మాళవిక. సౌత్‌లో ఇప్పుడు ఆమెకున్న సెక్సీ ఇమేజ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి కాదు. పర్ఫెక్ట్ షేప్ మెయింటైన్ చేస్తూ.. ప్రతి ఫొటో షూట్లోనూ సెక్సీ లుక్స్‌తో కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేని రాత్రులు మిగిలుస్తూ ఉంటుంది మాళవిక. ఒక్కోసారి ఒక్కో థీమ్‌తో ఫొటో షూట్లు చేసే మాళవిక.. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.
తాజాగా ఆమె వారియర్ ప్రిన్సెస్ అవతారంలోకి మారింది. తాను ఏదో ఒక కాలంలో వారియర్ ప్రిన్సెస్ అయ్యే ఉంటానంటూ ఈ థీమ్‌లో లుక్ రిలీజ్ చేసింది. వీర వనిత అవతారం ఎత్తినా ఆమెలో గ్లామర్‌కేమీ లోటు లేదు. ఎక్కడేం చూపించాలో అన్నీ చూపించింది. ఎలాంటి లుక్‌లో అయినా సెక్సీగా కనిపించడం మాళవికకే చెల్లిందంటూ ఆమె ఫాలోవర్లు కొనియాడుతున్నారు. కెరీర్ విషయానికి వస్తే మాళవిక చివరగా ‘మాస్టర్’ సినిమాతో పలకరించింది. ఆ చిత్రంతో తన దశ తిరిగిపోతుందనుకుంది కానీ.. అలా ఏమీ జరగలేదు. తమిళంలో ధనుష్ సరసన చేస్తున్న ‘మారన్’ మినహాయిస్తే సౌత్‌లో ఆమెకు మరో సినిమా లేదు.
హిందీలో ‘యుద్ర’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది మాళవిక. తెలుగులో విజయ్ సరసన ‘హీరో’ అనే సినిమాతో నేరుగా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ.. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల మొదలైన కొన్నాళ్లకే ఆగిపోయింది.
This post was last modified on November 7, 2021 4:17 am
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…