గూగుల్లోకి వెళ్లి లిజోమోల్ జోస్ అని కొట్టి చూడండి. కొన్ని ఫొటోలు డిస్‌ప్లే అవుతాయి. ఆ తర్వాత లిజో మోల్ జోస్ ఇన్ జై భీమ్ అని సెర్చ్ చేసి చూడండి. షాకై నోరెళ్లబెట్టకపోతే ఒట్టు. తొలి సెర్చ్‌లో ఎంతో అందంగా, మోడర్న్‌గా కనిపించిన ఈ అమ్మాయే ‘జై భీమ్’ సినిమాలో పేద గిరిజన మహిళగా పూర్తి డీగ్లామరస్ రోల్‌లో నటించిందంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. డీ గ్లామరస్ రోల్ కోసం ఎంతోమంది హీరోయిన్లు మేకోవర్ అయి ఉంటారు. కానీ లిజో మేకోవర్ మాత్రం వాటన్నింటినీ తలదన్నేదే. కేవలం లుక్ మార్చుకోవడం మాత్రమే కాదు.. పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయిన తీరుకు ఫిదా అవకుండా ఉండలేం.
సినతల్లి పాత్రలో ఆమె ఎంత గొప్పగా నటించిందంటే.. సినిమా చూస్తూ ఏదో ఒక దశలో ప్రతి ప్రేక్షకుడికీ కళ్లు చెమరుస్తాయి. సినతల్లి పాత్ర తాలూకు అంతులేని వేదనను కచ్చితంగా ప్రేక్షకుడు ఫీలై ఆమె పట్ల జాలి భావం కలుగుతుంది. హృదయం ద్రవించేలా ఆ పాత్రను లిజోమోల్ జోస్ పండించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. పొలం పనుల్లో కనిపించే తొలి సన్నివేశంలోనే లిజో పాత్ర తాలూకు అమాయకత్వం చూసి ముచ్చట పడతాం. చూడ్డానికి నల్లగా కనిపిస్తుంది కానీ.. ఆమెలోని కళ ముచ్చటగొలుపుతుంది.
ఇక ఒక దశ దాటాక లిజో పాత్రకు సంబంధించి కన్నీళ్లే చూస్తాం. తనతో పోలీసులు వ్యవహరించే తీరు చూసి మనసు చివుక్కుమంటుంది. అంత క్రూరంగా ప్రవర్తించిన పోలీసులే.. ఆమెకు తల వంచే ఓ సన్నివేశంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక కోర్టులో కేసు గెలిచాక బయట వర్షంలో తడుస్తూ కనిపించే లిజోను చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేం. ఒక పాత్ర ఇలాంటి మేకోవర్.. ఇంత గొప్ప నటన అరుదుగా చూస్తుంటాం. ఇందుకుగాను లిజోకు ఎన్ని అవార్డులిచ్చినా తప్పులేదు. ఈ ఏడాదికి ఉత్తమ జాతీయ నటిగా లిజోకు పురస్కారం దక్కినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on November 7, 2021 4:15 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…