కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక వెరైటీ కాన్సెప్ట్‌నే సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు నాని. కొన్ని పరాజయాలు ఎదురైన మాట నిజమే కానీ, నటుడిగా మాత్రం తనెప్పుడూ ఫెయిలవ్వలేదు. ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాలన్నీ కూడా ఒకదానితో ఒకటి పోలిక లేనివే. వాటన్నింటిలో శ్యామ్ సింగ రాయ్ కాస్త డిఫరెంట్ అని చెప్పాలి.
ఇదో పీరియడ్ ఫిల్మ్. బ్రిటిషర్స్ కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నాడు రాహుల్ సాంకృత్యన్. డిసెంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించిన నాటి నుంచి వరుస అప్‌డేట్స్‌తో ఆడియెన్స్‌కి ఊపిరాడనివ్వట్లేదు మేకర్స్. పోస్టర్లు, వీడియోలతో ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోడానికి ప్రయత్నించేదుకు పెద్ద స్కెచ్చే వేశారనిపిస్తోంది.
రీసెంట్‌గా దీపావళికి ముగ్గురు హీరోయిన్ల లుక్స్‌నీ రివీల్ చేశారు. ఇప్పుడు రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ‘పుట్టిందా ఓ అక్షరమే.. కాగితపు కడుపు చీల్చే.. అన్యాయం తలే తెంచే.. కరవాలంలా పదునైన కలమేరా శ్యామ్ సింగ రాయ్’ అంటూ కృష్ణకాంత్ రాసిన రిలిక్స్ వింటుంటే నాని పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. తన ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసినప్పుడు వెనుక స్వాంతంత్ర్యానికి పూర్వం నాటి ఓ ప్రింటింగ్ ప్రెస్ బోర్డ్ పోస్టర్‌లో నాని వెనుక కనిపించింది. ఇప్పుడు ఈ పాటను బట్టి నాని పోషించింది ఓ జర్నలిస్ట్ పాత్ర అయి ఉండొచ్చనిపిస్తోంది.
బెంగాలీ వ్యక్తిగా నాని గెటప్ పర్‌ఫెక్ట్గా ఉంది. అతని సరసన సాయిపల్లవి కూడా ఎంతో అట్రాక్టివ్‌గా, అచ్చమైన బెంగాలీ భామలా కనిపిస్తోంది. ఇది నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. ప్యాన్ ఇండియా రేంజ్‌లో కూడా విడుదలవుతోంది. దానికి తోడు ఇలాంటి అదిరిపోయే అప్‌డేట్స్‌తో టీమ్ సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తోంది. దాంతో సినిమాపై అంచనాలు బాగా పెరుగుతున్నాయి.
This post was last modified on November 7, 2021 3:57 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…