నందమూరి బాలకృష్ణ.. అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చేయడం ఒక సంచలనమే. ఈ కలయికను అసలెవ్వరూ ఊహించలేదు. వివిధ కారణాల వల్ల మెగా ఫ్యామిలీతో బాలయ్యకు కొంచెం గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఈ నందమూరి హీరో వచ్చి ఆహా ఓటీటీ కోసం షో చేస్తాడని ఎవరూ అనుకోలేదు. మరి అరవింద్ బాలయ్యతో ఏం మాట్లాడారో.. ఎలా ఒప్పించారో కానీ.. ఈ షోకు నందమూరి హీరో వల్ల బంపర్ క్రేజ్ వచ్చిన మాట వాస్తవం. దీపావళి కానుకగా రిలీజైన తొలి ఎపిసోడ్‌కు స్పందన కూడా అదిరిపోయింది. ఐతే బాలయ్యతో అల్లు వారి బంధం ఇప్పుడు మరో స్థాయికి వెళ్లబోతున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం. తొలిసారిగా నందమూరి నటసింహం గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయబోతున్నాడట. ఇందుకోసం చర్చలు జోరుగానే సాగుతున్నాయట. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
బాలయ్యతో ఇప్పటికే క్రిష్ రెండు ప్రాజెక్టులు చేశాడు. అందులో ఒకటైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి ఫలితాన్నే అందుకుంది. ‘యన్.టి.ఆర్’ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఈ ఇద్దరినీ మళ్లీ కలపబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. నిజానికి గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. గీతా ఆర్ట్స్-2 బేనర్ పెట్టినప్పటి నుంచి చిన్న, మీడియం బడ్జెట్లో వేరే హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా చేస్తే అదొక స్పెషల్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ‘అఖండ’ను పూర్తి చేసి.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాకు బాలయ్య సన్నద్ధం అవుతున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్యకు ఓ కమిట్మెంట్ ఉంది. మరి గీతా ఆర్ట్స్‌లో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి.
This post was last modified on November 7, 2021 3:15 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…