కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడే అయినప్పటికీ.. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇక్కడ కూడా ఆయన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయనకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. అలాంటి నటుడికి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో ఊహించని షాక్ సంఘటన ఎదురైంది.
ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా.. విజయ్ సేతుపతిపై ఒక వ్యక్తి సడెన్ గా ఎటాక్ చేశాడు. ఈ ఘటనతో విజయ్ సేతుపతితో పాటు.. ఆయనతో ఉన్న అనుచరులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ బయటకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో విజయ్ కి అసలేం జరుగుతుందో అర్ధం కాలేదు. వెంటనే ఆయన చుట్టుపక్కన ఉన్న సెక్యూరిటీ, పోలీసులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు దాడి చేసిన వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. విజయ్ లాంటి వ్యక్తిని అలా తన్నడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన కారణాలు తెలియాల్సివున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ సేతుపతి ఈ ఏడాది ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన చేతుల్లో దాదాపు పది సినిమాలున్నాయి. అందులో ఒక బాలీవుడ్ సినిమా కూడా ఉంది.
This post was last modified on November 4, 2021 4:16 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…