దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగానే కాదు.. అత్యధికంగా పారితోషికం తీసుకున్న డైరెక్టర్ అన్నంతనే గుర్తుకు వస్తారు ఎస్ఎస్ రాజమౌళి. తన కెరీర్ లో ఇప్పటివరకు తీసిన ఏ మూవీ కూడా పరాజయం కాకుండా ఉన్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం. ఆయన సినిమా అన్నంతనే అందరూ దాని వైపు చూడటమే కాదు.. ఆ ప్రాజెక్టు గంటల వ్యవధిలో క్రేజీగా మారిపోవటం తెలిసిందే. విజయానికి నిలువెత్తు నిర్వచనంగా చెప్పుకునే రాజమౌళి.. తాజాగా ఒక ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. తన గతాన్ని రివీల్ చేసి షాకిచ్చాడు.
ఈ రోజున ఇంత సక్సెస్ ఫుల్ గా పేరు తెచ్చుకున్న జక్కన్న.. కొంతకాలం క్రితం భార్య సంపాదన మీద బతికేవాడన్న విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. పెద్దగా చదువుకోని రాజమౌళి.. ఈ రోజున ఎన్నో విద్యా సంస్థలకు ముఖ్య అతిధిగా హాజరవుతూ విద్యార్థులకు తాను చెప్పాలనుకున్న మాటను చెబుతుంటారు.
తనకు చిన్నతనం నుంచి సినిమా ఇండస్ట్రీ తప్పించి మరింకేమీ తెలీదని.. తన ప్రపంచమంతా సినిమానే అని చెప్పారు. చిన్నతనంలో చదువు సరిగా అబ్బలేదని.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండటంతో అన్ని క్రాఫ్ట్సులో పని చేసినట్లు చెప్పారు. ఒక దర్శకుడికి అన్ని క్రాఫ్టుల్లో పట్టు ఉండాలన్న కసితో తాను అన్నీ నేర్చుకున్నట్లు చెప్పారు.
ఒక టైంలో తనకు పైసా సంపాదన లేదని.. అలాంటి వేళ తన భార్య రమా రాజమౌళి జీతం మీదనే తాను బతికినట్లు చెప్పారు. అప్పట్లో తనను ఆమే పోషించినట్లు చెప్పారు. అలా చెప్పుకోవటానికి తనకు సిగ్గేయటం లేదన్న రాజమౌళి.. సంతోషంగా ఉందన్నారు.
తాను దర్శకుడు కాక ముందు ఉన్న పనల్లా.. పొద్దున్నే భార్యను ఆఫీసులో డ్రాప్ చేయటం.. తిరిగి వచ్చి కథలు.. డైలాగ్స్ రాసుకోవటం.. సాయంత్రం ఐదింటికి ఆఫీసుకు వెళ్లి తీసుకొచ్చేవాడినని తన పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. విజేతగా నిలిచే ప్రతి ఒక్కరి వెనుక ఎవరో ఒకరు ఉంటారన్నది ఎంత నిజమో రాజమౌళి మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది.
This post was last modified on November 3, 2021 10:30 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…