అఫీషియల్.. చిరు సినిమాకి సైన్ చేసిన తమన్నా!

మిల్కీబ్యూటీ తమన్నా ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి అఫీషియల్ గా అగ్రిమెంట్ పై సైన్ చేసింది. కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆమెకి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేయడానికి నిర్మాతలకు రెండు నెలల సమయం పట్టింది. రీసెంట్ గానే తమన్నా ఈ సినిమాలో అఫీషియల్ గా ఆన్ బోర్డ్ అయింది. కొన్నిరోజుల్లో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో తమన్నా నటించింది. కానీ తెరపై వీరి కాంబినేషన్ పై విమర్శలు వినిపించాయి. చిరు బాగా లావుగా కనిపించడంతో.. ఆయన పక్కన తమన్నా సూట్ అవ్వలేదు. దీంతో రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ జంటను చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించింది. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి ఆమెనే రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి మొదలుకానుంది. జనవరి నెల నుంచి తమన్నా సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమన్నాను మరో సీనియర్ హీరో సినిమా కోసం నటించమని అడుగుతున్నారట. రెగ్యులర్ సినిమాల కంటే సీనియర్ హీరోలతో కలిసి నటించే సినిమాల కోసం అమ్మడు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.