Movie News

చిన్న దేవ‌ర‌కొండ.. తెలివొచ్చేసింద‌బ్బా

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా ప్ర‌య‌త్నాల్లో ఉన్న టైంలో అత‌డి త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌ యుఎస్‌లో ఉద్యోగం సంపాదించి అక్క‌డే సెటిలయ్యాడు. విజ‌య్ క‌ష్ట‌ప‌డుతున్న‌పుడు అత‌డికి ఆర్థికంగా అండ‌గా నిలిచింది త‌మ్ముడే. ఐతే అన్న హీరోగా నిల‌దొక్కుకోగానే అత‌ను ఉద్యోగం వ‌దిలేసి ఇక్క‌డికొచ్చేశాడు. సినిమాల్లోకి అడుగు పెట్ట‌డానికి నిర్ణ‌యించుకున్నాడు. ఈ నిర్ణ‌యం త‌న‌కు న‌చ్చ‌లేదు అంటూనే త‌మ్ముడికి స‌పోర్ట్ ఇచ్చాడు విజ‌య్.

ఐతే ఆనంద్ తొలి చిత్రం దొర‌సాని అత‌డికి ఏ ర‌కంగానూ మంచి ఫ‌లితాన్నివ్వలేదు. సినిమా డిజాస్ట‌ర్ అయింది. మ‌రోవైపు ఆనంద్ లుక్స్, న‌టన ప‌ట్ల నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. అయినా స‌రే ఆనంద్ వెనుకంజ వేయ‌లేదు. అన్న అండ‌తో అవ‌కాశాలు తెచ్చుకున్నాడు.

ఐతే పెద్ద స్టార్ అయిన విజ‌య్‌ను చూసి తాను స్టార్ లాగా వెలిగిపోవాల‌ని, మాస్ ఇమేజ్ తెచ్చేసుకోవాల‌ని ఆనంద్ ఆరాట‌ప‌డ‌క‌పోవ‌డం అభినందించాల్సిన విష‌యం. హీరోయిజం, ఇమేజ్ అనుకోకుండా మామూలు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడి పాత్రలున్న సినిమాల‌పై అత‌ను దృష్టిపెట్టాడు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మంచి సినిమా చేశాడు. ఆ సినిమాతో తొలి విజ‌యాన్నందుకున్న ఆనంద్.. త‌ర్వాతి అడుగులు కూడా జాగ్ర‌త్త‌గానే వేస్తున్నాడు.

అత‌డి నుంచి రానున్న కొత్త సినిమా పుష్ప‌క విమానం ట్రైల‌ర్ తాజాగా లాంచ్ అయింది. కొత్త‌గా పెళ్లయిన కుర్రాడు.. కొన్ని రోజుల‌కే పెళ్లాం లేచిపోతే ప‌డే ఇబ్బందుల నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డానికి చాలామంది వెనుకంజ వేస్తారు. కొత్త హీరోలైనా సరే కొంచెం త‌ట‌ప‌టాయిస్తారు. కానీ ఆనంద్ అలాంటి ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోకుండా ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డం అభినంద‌నీయ‌మే. ఇలాంటి క‌థా ప్రాధాన్య‌మున్న, కొత్త త‌ర‌హా సినిమాలు చేయ‌డం ద్వారా భిన్న‌మైన ఇమేజ్ వ‌స్తుంది. అది కెరీర్‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మొత్తానికి చిన్న దేవ‌ర‌కొండ తెలివిగానే అడుగులేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

This post was last modified on October 30, 2021 10:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

18 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

1 hour ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

7 hours ago