ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలిద్దరూ కలవడమే పెద్ద సర్‌ప్రైజ్ అంటే.. వాళ్లని రాజమౌళి డైరెక్ట్ చేయడం మరో పెద్ద సర్‌ప్రైజ్. ఇలాంటి ఎన్నో సర్‌ప్రైజులతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ని స్టార్ట్ చేసిన టీమ్.. ఆ తర్వాత ప్రతి అప్‌డేట్‌తోను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంది. రీసెంట్‌గా మరో సర్‌ప్రైజ్‌ను కూడా రెడీ చేశారు. దానికి సంబంధించిన ప్రకటన శుక్రవారం రావాల్సి ఉంది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేశారు. ఆ అప్‌డేట్‌ను ఇవాళ రిలీజ్ చేశారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ స్పెషల్ గ్లింప్స్‌ను నవంబర్ 1న ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు కన్‌ఫర్మ్ చేశారు. నలభై అయిదు సెకన్ల పాటు సాగే ఈ వీడియో మామూలుగా ఉండదంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, తారక్‌ల పాత్రల్ని పరిచయం చేస్తూ విడుదలైన టీజర్లు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇద్దరినీ కలిపి చూపించే గ్లింప్స్ రాబోతోంది. ఇది మామూలు ట్రీట్ కాదు అభిమానులకి.
సంక్రాంతి కానుకగా జనవరి 7న రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ ప్లాన్ ఉంది రాజమౌళికి. సినిమాని ఆయన మార్కెట్ చేస్తున్న విధానం కూడా అందరినీ అబ్బురపరుస్తోంది. రీసెంట్‌గా పీవీఆర్ సినిమాతో చేతులు కలిపారు మేకర్స్. తమ మల్టీప్లెక్సులన్నింటి పేర్లనీ పీవీఆర్‌ఆర్‌ఆర్‌గా మార్చేసిందా సంస్థ. మూవీ రిలీజయ్యే వరకు ఇది ఇలాగే కొనసాగనుంది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో రికార్డ్. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఇంకెన్ని రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో.
This post was last modified on October 30, 2021 3:09 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…