కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి 24 గంటలు దాటిపోయింది. ఇంకా ఆ వార్తను అభిమానులు నమ్మలేకపోతున్నారు. కాలం కొంచెం వెనక్కి వెళ్లిపోయి.. పునీత్‌కు ఏమీ కాకపోతే.. అతను ఎప్పట్లాగే మన మధ్య తిరిగిగే బాగుండే అనుకుంటున్నారు. నటుడిగానే కాక వ్యక్తిగానూ కోట్లమందికి స్ఫూర్తినిచ్చిన.. గొప్ప వ్యక్తిత్వం, సేవా భావం కలిగిన వ్యక్తి ఇలా హఠాత్తుగా ప్రాణాలు విడవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
సామాన్య అభిమానులే కాదు.. సెలబ్రెటీలు సైతం పునీత్ మృతితో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. పునీత్ కన్నడిగుడే కానీ.. తెలుగు వారితో పరోక్షంగా అతడికి మంచి అనుబంధమే ఉంది. మన స్టార్లలో చాలామందికి అతడికి సన్నిహితుడు. ముఖ్యంగా నందమూరి కుటుంబంతో అతడికి మంచి అనుబంధం ఉంది. బాలయ్యను అన్నయ్యలా, తారక్‌ను తమ్ముడిలా భావిస్తాడతను.
ఈ నేపథ్యంలోనే బాలయ్య, తారక్ ఇద్దరూ పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరుకు వెళ్లారు. బాలయ్య.. పునీత్ పార్థివ దేహాన్ని సందర్శిస్తున్నప్పటి వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. పునీత్ అన్నయ్య బాలయ్యను తోడ్కొని వెళ్తున్న వీడియో ఒకటి ఇప్పుడు అందరినీ కలచి వేస్తోంది. ఎప్పుడు నవ్వుతూ లేదంటే గంభీరంగా కనిపించే బాలయ్య.. ఏడుస్తున్న దృశ్యం ఈ వీడియోలో కనిపించింది. అలా ఏడుస్తూనే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం అన్నట్లుగా చేతితో సంజ్ఞ చేస్తూ అయ్యో అని బాలయ్య తల కొట్టుకోవడం వీడియోలో కనిపించింది. పక్కనే ఉన్న శివరాజ్ కుమార్ కళ్లల్లోనూ నీళ్లు కనిపించాయి. ఈ వీడియో అందరినీ కదిలించేస్తోంది.
గతంలో ‘యన్.టి.ఆర్’ సినిమా ప్రమోషన్ల కోసం బాలయ్య బెంగళూరుకు వెళ్లగా.. ఆ వేడుకలో శివరాజ్, పునీత్ పాల్గొన్నారు. వేదిక మీద బాలయ్య పక్కనే కూర్చున్న పునీత్.. కర్చీఫ్‌తో బాలయ్య ముఖం మీద తుడుస్తున్న వీడియో.. అలాగే స్పీచ్ ఇస్తూ బాలయ్యను బాలన్న అని సంబోధిస్తూ ఆయన కుటుంబం అంటే తన కుటుంబం లాగే అన్న వీడియో నిన్నట్నుంచి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పునీత్ కోసం బాలయ్య ఏడుస్తున్న వీడియో కూడా అలాగే వైరల్ అవుతోంది.
This post was last modified on October 30, 2021 1:10 pm
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు(ఆర్థిక సదస్సుగా దీనికి పేరు) రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా పోటా…
ఏపీ విపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ కనిపించడం లేదు. జగన్ రావాలి.. తమ పార్టీ ముందుకు సాగాలి అన్నట్టుగా…
ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…